నేడు, రేపు ట్రాఫిక్‌ మళ్లింపులు | Traffic Diversions In Hyderabad For Milad Un Nabi | Sakshi
Sakshi News home page

నేడు, రేపు ట్రాఫిక్‌ మళ్లింపులు

Published Sat, Nov 9 2019 8:51 AM | Last Updated on Sat, Nov 9 2019 8:51 AM

Traffic Diversions In Hyderabad For Milad Un Nabi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురునానక్‌ జయంతి వేడుకలతో పాటు మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో నగరంలో శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురునానక్‌ జయంతి వేడుకల్లో భాగంగా సిక్కులు అశోక్‌ బజార్‌లోని గురుద్వారా ర్యాలీగా బయలుదేరి మళ్లీ అక్కడికే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో శివాజీ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్‌ టి జంక్షన్, రంగ్‌ మహల్‌ జంక్షన్, నయాపూల్, శాంతి ఫైర్‌ వర్క్స్‌ మార్గంలో శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 వరకు మళ్లింపులు ఉంటాయి. మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పాతబస్తీ సహా కొన్ని చోట్ల ట్రాఫిక్‌ మళ్లిస్తారు. చార్మినార్, శాలిబండ, మోతిగల్లీ, మదీన, డబీర్‌పుర, అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్, చెత్తబజార్‌ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement