Milad Un Nabi festival
-
‘మిలాద్ ఉన్ నబి’: మహా ప్రవక్త జననం
అజ్ఞానతిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతులతో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు 1450 సంవత్సరాలు అవుతున్నా ఆ మహనీయుని బోధలు మనవద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని గనక మనం ఆచరించగలిగితే, నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించు కోవచ్చు. నేటి పరిస్థితుల నేపథ్యంలో ముహమ్మద్ ప్రవక్త(స) బోధనల పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.క్రీ.శ. 571 ఏప్రిల్ నెల ఇరవయ్యోతేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో ముహమ్మద్ ప్రవక్త(స) జన్మించారు. తల్లి దండ్రులు ఆమినా, అబ్దుల్లాహ్. ఈ మహనీయుడు జన్మించక ముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య అక్కున చేర్చుకున్నారు. నీతి, నిజాయితీ, సేవాతత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఈ కారణంగానే ఆయన ప్రజల మనసులు చూరగొని ‘సాదిఖ్ ’గా, ‘అమీన్’ గా పిలవబడ్డారు. ముహమ్మద్‌కు చదవడం, రాయడం రాదు. అయినా ఆయన బోధలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. నాటి యావత్ అరేబియా ద్వీపకల్పమంతా ఆయన బోధనలకు ఆకర్షిత మైంది. ఫలితంగా సమస్త దుర్మార్గాలూ అంతమయ్యాయి. అసత్యం, అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితనం, హత్యలు, అత్యాచారాలు అన్నీ సమసి పోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుంచి, స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్ళూనుకుంది. అన్నిరకాల చెడులు, అసమానతలుఅంతమై పొయ్యాయి.బడుగులు, బలహీనుల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి, సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే, ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ‘ముహమ్మద్ ’ మాత్రమేనని ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూల గ్రంథాలన్నీ ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహా పురుషులను గురించి మైకేల్ హెచ్.హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్’ ప్రవక్త పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రశంసించిన ఆమహనీయులు నేడు మనమధ్యలేరు.కాని ఆయన బోధనలు మనవద్ద సురక్షి తంగా ఉన్నాయి. మనం వాటిని ఆచరించ గలిగితే చాలు. ఎందుకంటే, నేటి మన సమాజం అన్నిరకాల అవలక్షణాలతో సతమతమవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతప్రగతి సాధించినా, నైతిక, ధార్మిక, మానవీయ రంగాల్లోమాత్రం తిరోగమనంలోనే ఉన్నామన్నది నిజం. నేటి మన సమాజంలో ఏరంగమూ సంతృప్తికరంగాలేదు. ఎంత ప్రగతిపథంలో పయనిస్తున్నా, నేటికీ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. స్త్రీలకు రక్షణలేని పరిస్థితి. అవినీతి, అక్రమాలకు కొదవే లేదు. మద్య΄ానం, జూదం, అశ్లీలం, అంటరానితనం, నిరక్షరాస్యత, ఆడసంతానం హత్యలు, అత్యాచారాలు, హత్యా రాజకీయాలు నిరాఘాటంగా సాగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ సమసి΄ోవాలంటే, సమాజం నుండి ఈ దుర్మార్గాలు అంతం కావాలంటే, నీతి, నిజాయితీలతో కూడిన, ఎలాంటి వివక్ష, తారతమ్యాలకు తావులేని, ఉన్నత మానవీయ విలువలతో నిండిన సుందర సౌభాగ్యవంతమైన సమాజం పునర్ నిర్మాణం కావాలంటే ఈ అమృత బోధనలను అధ్యయనం చేయాల్సిన, ఆచరించాల్సిన అవసరం ఉంది.(నేడు ప్రవక్త జయంతి ‘మిలాదున్నబీ’)– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఆ ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది, మానవాళికి ఆదర్శమయ్యారు
మానవుల మార్గదర్శనం కోసం అల్లాహ్ అన్ని కాలాల్లో, అన్నిజాతుల్లో తన ప్రవక్తలను ప్రభవింప జేశాడు. గ్రంథాలనూ అవతరింప జేశాడు. హజ్రత్ ఆదం (అ) మొదలు, ముహమ్మద్ ప్రవక్త (స) వరకు అనేక మంది సందేశహరులు భూమండలంపై జన్మించారు. వారిలో చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ (స). ఆయనపై అవతరించిన చివరి గ్రంథం పవిత్ర ఖురాన్ . ఇక ప్రళయకాలం వరకూ ప్రవక్తలూ రారు, గ్రంథాలూ అవతరించవు. కనుక మానవులు ప్రళయకాలం వరకు ఆయనను అనుసరించవలసిందే. ముహమ్మద్ ప్రవక్త తనంత తాను ఏమీ బోధించలేదు. మానవుల సంక్షేమం కోసం, సాఫల్యం కోసం దైవం అవతరింపజేసిన హితోపదేశాలనే ఆయన మానవాళికి అందజేశారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో, వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో, ఏది హితం కాదో ఆచరణాత్మకంగా ఆయన విశద పరిచారు. అందుకే ఆయన ప్రపంచ మానవాళికి సంపూర్ణ మార్గదర్శిగా పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని పవిత్ర జీవనానికి సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియా దేశంలోని మక్కానగరంలో ముహమ్మద్ ప్రవక్త (స) జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికి పుచ్చుకున్న ముహమ్మద్ ప్రవక్త, ‘అమీన్’గా, ‘సాదిఖ్’గా వినుతికెక్కారు. ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి. ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం. సుమారు వెయ్యిన్నర సంవత్సరాలంటే.. ఆ సమాజం ఎంత అనాగరికంగా ఉండేదో నేటి ఆధునికులకు తెలియనిదేం కాదు. ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కుతినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించే వారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది. నాటి సమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులు అయిన ముహమ్మద్ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు. ప్రవక్త బోధనల ప్రకారం... మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఆయనకు మాత్రమే భయపడాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి. స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు. సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కాపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటి మానవ సోదరులను తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. ఆమె మీకు జన్మనిచ్చిన తల్లి. ఆత్మీయత కురిపించే చెల్లి. ప్రేమించే ఇల్లాలు. అమ్మ పాదాల చెంత స్వర్గం ఉంది. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. శుభకార్యాల్లో వారినీ ఆహ్వానించాలి. వితంతువుల పునర్వివాహం వారి హక్కు. అజ్ఞానకాలపు దురాచారాలు, దుర్మార్గాలన్నింటినీ నేను అంతం చేస్తున్నాను. ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మానవులంతా ఒక్కటే. విద్యార్జన స్త్రీలు, పురుషులు అందరి విధి. జ్ఞానం జీవితం.. అజ్ఞానం మరణం. కళ్ళున్న వాళ్ళు, గుడ్డివాళ్ళు సమానం కానట్లే, జ్ఞాన సంపన్నులు, జ్ఞాన విహీనులు సమానం కాలేరు. ప్రతి తల్లీదండ్రీ తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే... పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతిపనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి. ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీ తనాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ముస్లింలకు సీఎం జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లిం సోదరసోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లిం సోదరసోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2023 -
భక్తిశ్రద్ధలతో మిలాద్–ఉన్– నబీ
-
Hyderabad: నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: మిలాద్– ఉన్– నబీ సందర్భంగా మంగళవారం నగరంలో శాంతి ర్యాలీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పాతబస్తీలోని వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాలీ వెళ్తున్న మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం, పూర్తిగా ఆపేయడం చేస్తారు. ఈ ప్రాంతాల్లోనే.. గులాం ముర్తుజా కాలనీలోని సయ్యద్ ఖాద్రీ చమాన్, ఇంజన్‌లి, షంషీర్గంజ్, లాల్ దర్వాజా మోడ్, రాజేష్ మెడికల్ హాల్, చార్మినార్ వద్ద ఉన్న నారాయణ స్కూల్, మక్కా మసీదు, చార్ కమాన్, గుల్జార్ హౌస్, మచిలీ కమాన్, ఎంఎం సెంటర్, పిస్తా హౌస్, నయాపూల్, సాలార్జంగ్ మ్యూజియం, ఎస్జే రోటరీ, దారుల్షిఫా, పురానీ హవేలీ. నేడు సాలార్జంగ్ మ్యూజియానికి సెలవు చారి్మనార్: మిలాద్–ఉన్–నబీ సందర్భంగా మంగళవారం నగరంలోని సాలార్జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని ఆయన కోరారు. చదవండి: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ -
నేడు, రేపు ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: గురునానక్ జయంతి వేడుకలతో పాటు మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో నగరంలో శని, ఆదివారాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురునానక్ జయంతి వేడుకల్లో భాగంగా సిక్కులు అశోక్ బజార్‌లోని గురుద్వారా ర్యాలీగా బయలుదేరి మళ్లీ అక్కడికే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో శివాజీ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయాపూల్, శాంతి ఫైర్ వర్క్స్ మార్గంలో శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 వరకు మళ్లింపులు ఉంటాయి. మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పాతబస్తీ సహా కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తారు. చార్మినార్, శాలిబండ, మోతిగల్లీ, మదీన, డబీర్‌పుర, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, చెత్తబజార్ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. -
‘విశేష’నామ వత్సరం.. 2015
ఎల్.ఎన్.పేట:పండుగలు, సెలవులు వస్తున్నాయంటే సంబరపడని వారెవరు?.. అంబరాన్నంటే సంబరాలతో మన ముంగిటికి అరుదెంచిన 2015 సంవత్సరం ప్రతి యేడు కంటే ఎక్కువ సెలవులు, ఎన్నో వింతలు, విశేషాలను తీసుకొచ్చింది. ఈ ఏడాది పండుగల్లో చాలా వాటిని గురువారం ఆక్రమించగా నాలుగు నెలల్లో ఐదు ఆదివారాలు రావడం విశేషం. ఒకే రోజు రెండు పండుగలు వచ్చే సందర్భాలూ ఉన్నాయి. శని, సోమవారాల్లో కొన్ని పండగలు వచ్చి ఆదివారంతో కలిపి జంట సెలవులు ఇప్పిస్తున్నాయి. ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఈ ఏడాదిలో రెండుసార్లు రావడం విస్మయపరుస్తోంది. అక్టోబర్‌లో 11 సెలవులు 2015 అక్టోబర్ నెలలో ఆదివారాలతో కలిపి ఎనిమిది సెలవులు రాగా, ఐచ్ఛిక సెలవులతో కలిపితే 11 సెలవులు రావడం విశేషం. వీటికి తోడు దసరా సెలవులు.. వెరసి ఈ నెలంతా సెలవులే సెలవులు. 4 నెలల్లో 5 ఆదివారాలు మార్చి, నవంబర్ నెలలు ఆదివారంతో ప్రారంభం అవుతుండగా మార్చి, మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో ఐదేసి ఆదివారాలు వస్తున్నాయి. రంజాన్, మొహర్రం శనివారమే ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతుంది. వీరు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్, మొహ్రం పండగలు మాత్రం శనివారం వచ్చాయి. ఒకేరోజు రెండు పండుగలు ఈ ఏడాది ఒకేరోజు రెండు పండుగలు.. అది కూడా ఐదు సందర్భాల్లో వస్తున్నాయి. జనవరి ఒకటి: నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి జనవరి 26: రథసప్తమి, గణతంత్ర దినోత్సవం మే2: అన్నమయ్య జయంతి, బుద్ధ జయంతి సెప్టెంబర్24: బక్రీద్, ఓనమ్ నవంబరు 25: కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి ఎనిమిది జంట సెలవులు జనవరి 25 ఆదివారం, 26 సోమవారం గణతంత్ర దినోత్సవం మార్చి 28 శనివారం, 29 ఆదివారం శ్రీరామ నవమి జూలై 18 శనివారం రంజాన్, 19 ఆదివారం ఆగస్టు 15 శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, 16 ఆదివారం సెప్టెంబర్ 5 శనివారం కృష్ణాష్టమి, 6 ఆదివారం అక్టోబర్ 24 శనివారం మొహర్రం, 25 ఆదివారం డిసెంబర్ 24 మిలాద్ ఉన్ నబీ, 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే (ఐచ్ఛిక సెలవు), 27 ఆదివారం గురువారానిదే ఆధిపత్యం నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమై, గురువారంతోనే(డిసెంబర్ 31) ముగుస్తుంది. అందుకేనేమో ఈ ఏడాది గురువారం ఆధిపత్యం కొనసాగనుంది. రెండు సంప్రదాయ పండుగలతో పాటు చిన్నాపెద్దా కలిపి మొత్తం 14 పండుగలు గురువారంనాడే వస్తున్నాయి. సంక్రాంతి, దసరా గురువారమే వచ్చాయి. 10 పండుగలతో శుక్రవారం రెండో స్థానంలో ఉంది. శనివారం 9 పండుగలు, బుధవారం 7, ఆది, సోమవారాల్లో 5, మంగళవారం 4 పండుగలు రానున్నాయి. ఒకే పండుగ రెండుసార్లు సాధారణంగా ఏ పండుగైనా ఏడాదిలో ఒకసారే వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం రెండు పండుగలు రెండేసిసార్లు రావడం అరుదైన విశేషం. వైకుంఠ ఏకాదశి: జనవరి 1, డిసెంబర్ 21 మిలాద్ ఉన్ నబీ: జనవరి 4, డిసెంబర్ 24