సాక్షి, హైదరాబాద్: మిలాద్– ఉన్– నబీ సందర్భంగా మంగళవారం నగరంలో శాంతి ర్యాలీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పాతబస్తీలోని వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాలీ వెళ్తున్న మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం, పూర్తిగా ఆపేయడం చేస్తారు.
ఈ ప్రాంతాల్లోనే..
గులాం ముర్తుజా కాలనీలోని సయ్యద్ ఖాద్రీ చమాన్, ఇంజన్‌లి, షంషీర్‌గంజ్, లాల్ దర్వాజా మోడ్, రాజేష్ మెడికల్ హాల్, చార్మినార్ వద్ద ఉన్న నారాయణ స్కూల్, మక్కా మసీదు, చార్ కమాన్, గుల్జార్ హౌస్, మచిలీ కమాన్, ఎంఎం సెంటర్, పిస్తా హౌస్, నయాపూల్, సాలార్జంగ్ మ్యూజియం, ఎస్‌జే రోటరీ, దారుల్‌షిఫా, పురానీ హవేలీ.
నేడు సాలార్‌జంగ్ మ్యూజియానికి సెలవు
చారి్మనార్: మిలాద్–ఉన్–నబీ సందర్భంగా మంగళవారం నగరంలోని సాలార్‌జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని ఆయన కోరారు.
చదవండి: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment