ఎస్‌సీఆర్ డబుల్ ధమాకా | SCR double dhamaka | Sakshi
Sakshi News home page

ఎస్‌సీఆర్ డబుల్ ధమాకా

Published Fri, Nov 29 2013 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

SCR double dhamaka

జింఖానా, న్యూస్‌లైన్: వార్షిక బాస్కెట్‌బాల్ లీగ్‌లో మహిళల, పురుషుల విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జట్లు విజేతగా నిలిచాయి. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం నిర్వహించిన ఈ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో ఎస్‌సీఆర్ 64-61తో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ (ఏఓసీ)పై విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోటీలో తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 31-30తో ఎస్‌సీఆర్ ఆధిక్యంలో ఉంది. ఆట ఆద్యంతం ఎస్‌సీఆర్ ఆటగాళ్లు మురళి (15), నిహాల్ (13), లిజు (13), నవీన్ (11) దూకుడుగా ఆడారు. ఏఓసీ జట్టు తరఫున ఇర్ఫాన్ 28, సంజయ్ 14, జలీల్ 10 పాయింట్లు చేశారు.
 
 మహిళల విభాగంలో దక్షిణ మధ్య రైల్వే 52-20తో వైఎంసీఏ-సికింద్రాబాద్‌పై అలవోక విజయం సాధించింది. మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి ఎస్‌సీఆర్ 28-8తో ముందంజలో ఉంది. ఎస్‌సీఆర్ క్రీడాకారులు అనూష (13), కవల్జిత్ (12), గాయత్రి (10) చక్కటి ఆట తీరుతో ఆకట్టుకున్నారు. వైఎంసీఏ జట్టులో శ్రీత 16 పాయింట్లు నమోదు చేయగా, పూర్ణిమ 4 పాయింట్లు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement