హైదరాబాద్ జిల్లా పైకా మహిళల క్రీడలు సోమవారం నుంచి నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (హెచ్‌డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో మొదట 11న కబడ్డీ టోర్నీ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా పైకా మహిళల క్రీడలు సోమవారం నుంచి నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (హెచ్‌డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో మొదట 11న కబడ్డీ టోర్నీ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది.
అనంతరం 13న ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, హాకీ టోర్నీ కమ్ సెలక్షన్ ట్రయల్స్ జింఖానా మైదానంలో నిర్వహిస్తారు. అదే రోజు ఎల్బీ స్టేడియంలో స్విమ్మింగ్ పోటీలు జరుగుతాయి.
ఈనెల 16న జింఖానా మైదానంలో బాస్కెట్‌బాల్, టెన్నిస్, ఎల్బీ స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్ పోటీలు నిర్వహిస్తారు.
20న హ్యాండ్‌బాల్ పోటీలు ఎల్బీ స్టేడియంలో జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారిణిలు వయస్సు ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలి. ఇతర వివరాలకు జింఖానా మైదానంలోని హెచ్‌డీఎస్‌ఏ అధికారి ఎ.అలీమ్ ఖాన్ (040 27900649)ను సంప్రదించవచ్చు.