హైదరాబాద్ జిల్లా స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నమెంట్ ఈనెల 22 నుంచి 24 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనుంది.
ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నమెంట్ ఈనెల 22 నుంచి 24 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్‌డీహెచ్‌బీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈటోర్నీని విశాల్ సింగ్ స్మారకార్థంగా నిర్వహిస్తున్నట్లు సి.హెచ్ ఫ్రాంక్లిన్ తెలిపారు.
బాల బాలికల విభాగాల్లో ఈపోటీలు నిర్వహిస్తున్నట్లు, ఆసక్తి గల స్కూల్ జట్లు తమ ఎంట్రీలను ఈనెల 21లోగా పంపించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాలకు పి.జగన్‌మోహన్ గౌడ్(98491-94841), డాక్టర్ రవి కుమార్(98662-29937)లను సంప్రదించవచ్చు.