ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జంటనగరాల్లో ఈ నెల 23న జరగనున్న ఒలింపిక్ పరుగును ఎవరు నిర్వహించాలనే విషయంపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. శాప్ కమిటీ హాల్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం తమ తప్పని కొందరు క్రీడా సంఘాల నేతలు అంగీకరించడంతోపాటు రాష్ట్ర ఒలింపిక్ సంఘం నిబంధనల ప్రకారం నడుచుకొంటామని హెచ్‌డీఓఏ అధ్యక్షుడు బి.విజయకుమార్ యాదవ్‌కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
దీంతో హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ పరుగు నిర్వహించాలని, ఇది తెలంగాణ ప్రభుత్వ పరుగు కాదని వారు అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ క్రీడా సంఘాలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, పీడీలు, కోచ్‌ల సమావేశాన్ని ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫతేమైదాన్ క్లబ్‌లో ఏర్పాటు చేసినట్లు హెచ్‌డీఓఏ ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తెలిపారు.
ఒలింపిక్ పరుగుపై సద్దుమణిగిన వివాదం
Published Sat, Jun 14 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement