olympic run
-
కడపలో వేడుకలా కొనసాగిన ఒలంపిక్ రన్
-
ప్రజాసంకల్పయాత్రలో ఒలింపిక్ డే సంబరాలు
-
ఒలింపిక్ రన్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో శనివారం ఒలింపిక్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్ చింతపల్లి వద్ద ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. అనంతరం జననేత జెండా ఊపి ఒలింపిక్ రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్రీకాకారులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేడు వర్షం కారణంగా ప్రజాసంకల్పయాత్ర ఆలస్యంగా ప్రారంభం కానుంది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్ర మార్నింగ్ సెషన్ రద్దు.. వర్షం కారణంగా ప్రజాసంకల్పయాత్ర మార్నింగ్ సెషన్ రద్దయినట్లు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యాహ్నానికి వర్షం ఆగితే పాదయాత్రను వైఎస్ జగన్ కొనసాగిస్తారని తెలిపారు. ఈ రోజు జరిగే సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశం కూడా రద్దయినట్లు ఆయన పేర్కొన్నారు. రేపు యధాతథంగా వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. -
పరుగు సాగేనా..?
తిరుపతి సిటీ: జిల్లాలో రెండేళ్లుగా ఒలింపిక్ రన్‌ను నామమాత్రంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడా ది జిల్లాలో ఒలింపిక్ రన్ లేనట్లేనని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ వైఖరితో రాష్ట్ర ఒలింపిక్ సంఘం రెండుగా చీలిపోయింది. జిల్లాలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వర్గానికి చెందిన అసోసియేషన్‌కు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి, సెక్రటరీగా పుంగనూరుకు చెందిన కృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. గల్లా జయదేవ్ ఆధ్వర్యంలో మరో అసోసియేషన్ ఏర్పడింది. మూడేళ్ల కిందట అప్ప ట్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రి వర్గంలో ఉం డడంతో సుధీర్ రెడ్డి నేతృత్వంలోని అసోసియేషన్ 2015లో ఒలింపిక్ రన్‌ను ఘనంగా నిర్వహిం చింది. ఆ తరువాత రెండేళ్లుగా ఆ అసోసియేషన్ పత్తా లేకుండా పోయింది. జయదేవ్ అసోసియేషన్‌లో లుకలుకలు గల్లా జయదేవ్ అసోసియేషన్‌లోని ప్రతినిధుల మధ్య సఖ్యత కొరవడినట్లు తెలుస్తోంది. ఈ సం ఘంలోని కొన్ని క్రీడా సంఘాల ప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదులు గల్లా జయదేవ్‌కు వెళ్లాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలో అడహక్ కమిటీని ఆయన ఏడాది కిందట ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరుపతి అడహక్ కమిటీ ప్రతినిధులు క్రీడాకారులతో కలిసి శనివారం వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఒలింపిక్ రన్‌ను ప్రారంభించనున్నారు. నిధులు విడుదల చేయని శాప్.. గత ఏడాది ఒలింపిక్ రన్ నిర్వహణకు శాప్ రూ.50 వేల నిధులు విడుదల చేసింది. ఆ నిధులు తిరుపతిలో నిర్వహించిన రన్ ర్యాలీకి ఇవ్వలేదనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఒలింపిక్ రన్‌ను ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సి ఉంది. శాప్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిధులు, ఆదేశాలు జారీ కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్ రన్‌ను పూర్తిగా విస్మరించిందని పలువురు అంటున్నారు. యోగా డే మాత్రం జిల్లా వ్యాప్తంగా అధి కారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహిం చారు. అంతర్జాతీయ ఒలింపిక్ డేను దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఘనంగా నిర్వహిస్తున్నా, జిల్లాలో నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఒలింపిక్ సంఘంలో ప్రభుత్వం చిచ్చు.. ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు విషయంలో గల్లా జయదేవ్, సీఎం రమేష్ వర్గాల మధ్య పోటీ నెలకొనడంతో, గల్లా జయదేవ్ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు నిచ్చింది. అయితే, ఇచ్చిన వారితో సంప్రదింపులు జరపకుండా సీఎం రమేష్ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తున్నట్లు క్రీడా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర క్రీడా సంఘాలను, ఒలింపిక్ అసోíసియేషన్ను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించి విబేధాలు సృష్టించి క్రీడలకు రాష్ట్రంలో ఉన్న విలువలను పూర్తిగా దిగజారుస్తోందని క్రీడాకారులు ఆరో పిస్తున్నారు. నేడు వైఎస్ జగన్ చేతుల మీదుగా ఒలింపిక్ రన్ కాగడా ప్రారంభం తిరుపతి సిటీ: అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ కాగడాను ప్రతిపక్ష నాయకులు వైఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో శనివారం ఒలింపిక్ డే రన్ టార్చ్‌ను ప్రారంభించనున్నా రు. ఈకార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన 75 మంది జాతీయ క్రీడాకారులు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి శుక్రవారం బయలుదేరి వెళ్లారు. క్రీడాకారుల బస్సును ఒలింపిక్ అడహక్ కమిటీ సభ్యుడు, రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి సురేంద్రరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్కె.పురుషోత్తం నేతృత్వంలో 1000 మంది క్రీడాకారులతో కలిసి తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఒలింపిక్ డే రన్ టార్చ్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లాల ప్రతినిధులు వైఎస్.జగన్ ప్రజాసంకల్ప యాత్ర జరిగే ప్రాం తానికి చేరుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రయివేట్ పీఈటీల అసోసియేషన్ కోశాధికారి మురళి, స్కేటింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పావని, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నేడు ఒలింపిక్ రన్
అనంతపురం కల్చరల్ : సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శుక్రవారం ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు టవర్‌క్లాక్ నుంచిlసప్తగిరి సర్కిల్ వరకు ఒలింపిక్ రన్ సాగుతుందన్నారు. డీఈఓ అంజయ్యతో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొంటారన్నారు. భారత క్రీడాకారులకు మద్దతుగా కవులు తమ కవితలను వినిపిస్తారన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలన్నారు. -
ఘనంగా ప్రపంచ ఒలింపిక్ రన్ దినోత్సవం
-
అటు పరుగు... ఇటు పరుగు!
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ స్ఫూర్తిని చాటాల్సిన చోట క్రీడా స్ఫూర్తి కనిపించకుండా పోయింది. ఒలింపిక్ డే గొప్పతనం గురించి చెప్పాల్సిన చోట రాజకీయాలు వచ్చేశాయి. పోటాపోటీగా ఒలింపిక్ రన్‌ను నిర్వహించడంలో తెలంగాణలోని రెండు ఒలింపిక్ సంఘాలు తమ పట్టుదలను ప్రదర్శించాయి. వరల్డ్ ఒలింపిక్ డే సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) పోటాపోటీగా రెండు రన్లు నిర్వహిం చాయి. జనాలను రన్లో భాగస్వాములను చేయడంలో మాత్రం ఇరు వర్గాలు కొంత వరకు సఫలం అయ్యాయి. రెండు సంఘాలు హైదరాబాద్‌లోని ఆరేసి కేంద్రాలనుంచి పరుగు నిర్వహించాయి. పలువురు మాజీ, వర్ధమాన ఆటగాళ్లు పరుగులో పాల్గొని క్రీడాజ్యోతులను ఎల్బీ స్టేడియానికి తీసుకు వచ్చారు. రంగారావు నేతృత్వంలోని ఓఏటీ తమ రన్ ముగింపు కార్యక్రమాన్ని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) మేనేజింగ్ డెరైక్టర్ ఇందులో పాల్గొనడం విశేషం. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు బీవీ పాపారావు హాజరయ్యారు. మాజీ ఆటగాళ్లు ముకేశ్‌కుమార్, జుల్ఫికర్, మీర్ ఖాసిం అలీ, ముళినీరెడ్డి, ఎస్ఎం ఆరిఫ్ తదితరులు ఇక్కడ కనిపించారు. మరో వైపు ఎల్బీ ప్రధాన గ్రౌండ్లో టీఓఏ ముగింపు ఉత్సవం జరిగింది. క్రీడాకారుల్లో నైనా జైస్వాల్, ఎడ్వర్డ్, అలోయిసిస్, రవీనా, రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ తదితరులు ఈ వేదికపై ఉన్నారు. టీఓఏ అధ్యక్షుడు జితేందర్ రెడ్డితో పాటు ఇద్దరు శాసనసభ్యులు ఇందులో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి సంబంధించి ఇరు వర్గాలు క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావును ఆహ్వానించినా, ఏదో ఒక దానికి హాజరైతే వివాదం అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిసింది. -
ఒలింపిక్ పరుగుపై సద్దుమణిగిన వివాదం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జంటనగరాల్లో ఈ నెల 23న జరగనున్న ఒలింపిక్ పరుగును ఎవరు నిర్వహించాలనే విషయంపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. శాప్ కమిటీ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం తమ తప్పని కొందరు క్రీడా సంఘాల నేతలు అంగీకరించడంతోపాటు రాష్ట్ర ఒలింపిక్ సంఘం నిబంధనల ప్రకారం నడుచుకొంటామని హెచ్‌డీఓఏ అధ్యక్షుడు బి.విజయకుమార్ యాదవ్‌కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ పరుగు నిర్వహించాలని, ఇది తెలంగాణ ప్రభుత్వ పరుగు కాదని వారు అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ క్రీడా సంఘాలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, పీడీలు, కోచ్‌ల సమావేశాన్ని ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫతేమైదాన్ క్లబ్లో ఏర్పాటు చేసినట్లు హెచ్‌డీఓఏ ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తెలిపారు. -
ఒలింపిక్ రన్‌పై సమీక్ష
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నగరంలో ఈనెల 23న జరిగే ఒలింపిక్ రన్ నిర్వహణ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని శాప్ కార్యాలయంలోని కమిటీ హాల్లో గురువారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు బి.వి.పాపారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జయేష్ రంజన్ ఐఏఎస్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కె.నర్సయ్య, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కె.రంగారావు, బ్యాడ్మింటన్ ద్రోణాచార్య గ్రహీత ఎస్.ఎం.ఆరిఫ్, వాలీబాల్ అర్జున అవార్డు గ్రహీత రవికాంత్ రెడ్డి, హైదరాబాద్ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్, రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నర్సింగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ రన్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు: ఏపీఓఏ ఒలింపిక్ రన్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈనెల 9న ఒలింపిక్ భవన్లో తెలంగాణ రాష్ట్ర క్రీడా సంఘాల సమావేశంలో ఈ రన్ నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తమ అనుమతి లేకుండా ఒలింపిక్ రన్‌పై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు.