వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో శనివారం ఒలింపిక్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్ చింతపల్లి వద్ద ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. అనంతరం జననేత జెండా ఊపి ఒలింపిక్ రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్రీకాకారులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు వర్షం కారణంగా ప్రజాసంకల్పయాత్ర ఆలస్యంగా ప్రారంభం కానుంది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.
ప్రజాసంకల్పయాత్రలో ఒలింపిక్ డే సంబరాలు
Jun 23 2018 10:38 AM | Updated on Mar 21 2024 5:20 PM
Advertisement