సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో శనివారం ఒలింపిక్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్ చింతపల్లి వద్ద ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. అనంతరం జననేత జెండా ఊపి ఒలింపిక్ రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్రీకాకారులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు వర్షం కారణంగా ప్రజాసంకల్పయాత్ర ఆలస్యంగా ప్రారంభం కానుంది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.
పాదయాత్ర మార్నింగ్ సెషన్ రద్దు..
వర్షం కారణంగా ప్రజాసంకల్పయాత్ర మార్నింగ్ సెషన్ రద్దయినట్లు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యాహ్నానికి వర్షం ఆగితే పాదయాత్రను వైఎస్ జగన్ కొనసాగిస్తారని తెలిపారు. ఈ రోజు జరిగే సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశం కూడా రద్దయినట్లు ఆయన పేర్కొన్నారు.
రేపు యధాతథంగా వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment