ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నగరంలో ఈనెల 23న జరిగే ఒలింపిక్ రన్ నిర్వహణ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని శాప్ కార్యాలయంలోని కమిటీ హాల్‌లో గురువారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు బి.వి.పాపారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో జయేష్ రంజన్ ఐఏఎస్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కె.నర్సయ్య, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కె.రంగారావు, బ్యాడ్మింటన్ ద్రోణాచార్య గ్రహీత ఎస్.ఎం.ఆరిఫ్, వాలీబాల్ అర్జున అవార్డు గ్రహీత రవికాంత్ రెడ్డి, హైదరాబాద్ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్, రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నర్సింగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒలింపిక్ రన్‌తో ప్రభుత్వానికి
సంబంధం లేదు: ఏపీఓఏ
ఒలింపిక్ రన్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈనెల 9న ఒలింపిక్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడా సంఘాల సమావేశంలో ఈ రన్ నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తమ అనుమతి లేకుండా ఒలింపిక్ రన్‌పై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు.
ఒలింపిక్ రన్‌పై సమీక్ష
Published Fri, Jun 13 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement