కాకినాడకు బయలుదేరుతున్న క్రీడాకారులు
తిరుపతి సిటీ: జిల్లాలో రెండేళ్లుగా ఒలింపిక్ రన్‌ను నామమాత్రంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడా ది జిల్లాలో ఒలింపిక్ రన్ లేనట్లేనని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ వైఖరితో రాష్ట్ర ఒలింపిక్ సంఘం రెండుగా చీలిపోయింది. జిల్లాలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వర్గానికి చెందిన అసోసియేషన్‌కు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి, సెక్రటరీగా పుంగనూరుకు చెందిన కృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. గల్లా జయదేవ్ ఆధ్వర్యంలో మరో అసోసియేషన్ ఏర్పడింది. మూడేళ్ల కిందట అప్ప ట్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రి వర్గంలో ఉం డడంతో సుధీర్ రెడ్డి నేతృత్వంలోని అసోసియేషన్ 2015లో ఒలింపిక్ రన్‌ను ఘనంగా నిర్వహిం చింది. ఆ తరువాత రెండేళ్లుగా ఆ అసోసియేషన్ పత్తా లేకుండా పోయింది.
జయదేవ్ అసోసియేషన్‌లో లుకలుకలు
గల్లా జయదేవ్ అసోసియేషన్‌లోని ప్రతినిధుల మధ్య సఖ్యత కొరవడినట్లు తెలుస్తోంది. ఈ సం ఘంలోని కొన్ని క్రీడా సంఘాల ప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదులు గల్లా జయదేవ్‌కు వెళ్లాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలో అడహక్ కమిటీని ఆయన ఏడాది కిందట ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరుపతి అడహక్ కమిటీ ప్రతినిధులు క్రీడాకారులతో కలిసి శనివారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఒలింపిక్ రన్‌ను ప్రారంభించనున్నారు.
నిధులు విడుదల చేయని శాప్..
గత ఏడాది ఒలింపిక్ రన్ నిర్వహణకు శాప్ రూ.50 వేల నిధులు విడుదల చేసింది. ఆ నిధులు తిరుపతిలో నిర్వహించిన రన్ ర్యాలీకి ఇవ్వలేదనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఒలింపిక్ రన్‌ను ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సి ఉంది. శాప్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిధులు, ఆదేశాలు జారీ కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్ రన్‌ను పూర్తిగా విస్మరించిందని పలువురు అంటున్నారు. యోగా డే మాత్రం జిల్లా వ్యాప్తంగా అధి కారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహిం చారు. అంతర్జాతీయ ఒలింపిక్ డేను దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఘనంగా నిర్వహిస్తున్నా, జిల్లాలో నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువె త్తుతున్నాయి.
ఒలింపిక్ సంఘంలో ప్రభుత్వం చిచ్చు..
ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు విషయంలో గల్లా జయదేవ్, సీఎం రమేష్ వర్గాల మధ్య పోటీ నెలకొనడంతో, గల్లా జయదేవ్ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు నిచ్చింది. అయితే, ఇచ్చిన వారితో సంప్రదింపులు జరపకుండా సీఎం రమేష్ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తున్నట్లు క్రీడా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర క్రీడా సంఘాలను, ఒలింపిక్ అసోíసియేషన్‌ను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించి విబేధాలు సృష్టించి క్రీడలకు రాష్ట్రంలో ఉన్న విలువలను పూర్తిగా దిగజారుస్తోందని క్రీడాకారులు ఆరో పిస్తున్నారు.
నేడు వైఎస్ జగన్ చేతుల మీదుగా ఒలింపిక్ రన్ కాగడా ప్రారంభం
తిరుపతి సిటీ: అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ కాగడాను ప్రతిపక్ష నాయకులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో శనివారం ఒలింపిక్ డే రన్ టార్చ్‌ను ప్రారంభించనున్నా రు. ఈకార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన 75 మంది జాతీయ క్రీడాకారులు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి శుక్రవారం బయలుదేరి వెళ్లారు. క్రీడాకారుల బస్సును ఒలింపిక్ అడహక్ కమిటీ సభ్యుడు, రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి సురేంద్రరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్‌కె.పురుషోత్తం నేతృత్వంలో 1000 మంది క్రీడాకారులతో కలిసి తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఒలింపిక్ డే రన్ టార్చ్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లాల ప్రతినిధులు వైఎస్.జగన్ ప్రజాసంకల్ప యాత్ర జరిగే ప్రాం తానికి చేరుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రయివేట్ పీఈటీల అసోసియేషన్ కోశాధికారి మురళి, స్కేటింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పావని, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment