800 మీ. పరుగులో అనీశ్‌కు స్వర్ణం | 800 meters run Anish won gold medal | Sakshi
Sakshi News home page

800 మీ. పరుగులో అనీశ్‌కు స్వర్ణం

Published Mon, Mar 31 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

800 meters run Anish won gold medal

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా జూనియర్ అథ్లెటిక్ మీట్‌లో అండర్-18 బాలుర విభాగం 800 మీ. పరుగు పందెంలో అనీశ్ కుమార్ పాఠక్ స్వర్ణపతకం గెలుపొందాడు. పోటీని అతను 2ని. 10.3 సెకన్లలో పూర్తి చేశాడు. ప్రమోద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకోగా, కుందన్ మూడోస్థానంతో కాంస్యం నెగ్గాడు. ఈ పోటీలు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగాయి.
 
 ఫైనల్స్ ఫలితాలు: అండర్-18 బాలురు: 100 మీ.: 1.శివం జయంత్, 2.పాణిరామ్, 3. కమలేష్ కుమార్; 200 మీ.: 1.శివం జయంత్, 2. భరత్ కుమార్, 3.వంశీకృష్ణ; 1500 మీ.: 1. సమన్విత్, 2.కుందన్, 3. శివ శంకర్;   లాంగ్‌జంప్: 1.విక్రాంత్ జయంత్, 2. చంద్ర ప్రకాష్, 3.ఎం.కుమార స్వామి; డిస్కస్‌త్రో: 1. సమరసింహారెడ్డి, 2.ఎం.అవినాష్, 3.పి.సాయికృష్ణ; అండర్-20 బాలురు: 100 మీ.: 1.ప్రవీణ్ మూర్తి, 2.అమీర్, 3.కె.సాయి ప్రదీప్; 200 మీ.: 1.అమర్, 2.టి.గోపాల్‌శర్మ, 3.పి.సాయి కిషోర్; 5000 మీ.: 1.అజయ్, 2.రాంగోపాల్ శర్మ, 3.డి.పవన్ ; లాంగ్‌జంప్: 1.ప్రవీణ్ మూర్తి, 2.ధనమేంధ్రీ, 3.లక్ష్మణ్;  డిస్కస్‌త్రో: 1.అంకిత్ పాఠక్, 2. ఫరూక్  3. ఉదిత్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement