రోహిత, కార్తీక్‌లకు టైటిల్స్ | Rohitha,karthik won sub-junnior chess tournment | Sakshi
Sakshi News home page

రోహిత, కార్తీక్‌లకు టైటిల్స్

Published Mon, Apr 28 2014 1:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Rohitha,karthik won sub-junnior chess tournment

సబ్ జూనియర్ చెస్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సబ్ జూనియర్ అండర్-15 చెస్ సెలక్షన్ చాంపియన్‌షిప్‌లో జేసీ కార్తీక్, సబ్బి రోహిత విజేతలుగా నిలిచారు. జాంబాగ్‌లోని వివేకవర్ధని కళాశాలలో రెండు రోజుల పాటు ఈ టోర్నీ జరిగింది. బాల బాలికల విభాగాల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. బాలుర విభాగంలో 5 రౌండ్ల ద్వారా 5 పాయింట్లు సాధించిన కార్తీక్‌కు తొలి స్థానం దక్కింది. 4 పాయింట్లు సాధించిన షణ్ముఖ తేజ రెండో స్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో రోహిత, మేఘనలకు తొలి రెండు స్థానాలు దక్కాయి. వివేకవర్ధని సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆనంద్ అబ్కారి విజేతలకు బహుమతులు అందజేశారు.  
 
 విజేతల వివరాలు
 బాలురు: 1. జేసీ కార్తీక్, 2. షణ్ముఖ తేజ, 3. కె. విశ్వజిత్ అరవింద్, 4. రుత్విక్ పొన్నపల్లి.
 బాలికలు:1. సబ్బి రోహిత, 2. మేఘన సిరిగుడి, 3. పి. లాస్య ప్రియ, 4. ఆర్. హరి లాస్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement