ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్ట్‌లే లేరని శాసనసభలో ప్రభుత్వం చెప్పిందని, ఈ మేరకు కేంద్రానికి నివేదిక కూడా పంపిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఇప్పుడేమో ఆర్టీసీ సమ్మెలో మావోయిస్ట్‌లు ఉన్నారని పోలీసు అధికారులు చెబుతున్నారని ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం.. అని ప్రశ్నించారు. పోలీసులు ప్రతి అంశాన్ని శాంతి భద్రతల కోణంలోనే చూడటం సబబుకాదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే నగరాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉండగా అది జరగడం లేదని ఆరోపించారు.
నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని కమిషనర్ అంజనీ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు హైదరాబాద్‌లో స్వేచ్ఛగా నిరసన తెలిపే అవకాశాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. సోమవారం పార్టీ నేతలు పీఎల్ విశ్వేశ్వరరావు, వెంకట్‌రెడ్డి, శ్రీశైల్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘చలో ట్యాంక్‌బండ్’ సందర్భంగా ప్రభుత్వమే ఎక్కడికక్కడ కంచెలు వేసి ప్రజలకు ఇబ్బందులు, అసౌకర్యం కలిగేలా చేసిం దని విమర్శించారు. ఆర్టీసీని నడిపించడం ప్రభుత్వ బా« ధ్యత కాగా, ఇంకెన్ని రోజులు ఆర్టీసీకి సహాయం చేయాలనడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment