సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, రక్షణపై గురువారం హైద్రాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. దిశ సంఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం మహిళల భద్రత కోసం క్యాబ్ సర్వీస్ నిర్వహుకులతో సమావేశమయ్యారు. సమావేశంలో సిటీకి చెందిన 15 ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థలు పాల్గొన్నాయి. నగర సీపీ, ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేవంలో.. మహిళల భద్రతకు క్యాబ్ నిర్వాహకులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్యాబ్‌లలో మహిళా భద్రత కోసం ఉన్న యాప్‌లను డిస్‌ప్లే చేయడంతో పాటు డయల్ 100కు కాల్స్ అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా క్యాబ్ నిర్వహకులకు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి రెండు, మూడు రోజులకొసారి డ్రైవర్ల ప్రవర్తనపై కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment