సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అకాల వర్షాలు, అతివృష్టి వల్ల వరి పంట చాలా దెబ్బతిందని, ధాన్యం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్ మొదట్లో వాతావరణం అనుకూలించలేదని, ఆ తర్వాత వర్షా లు పుంజుకున్నాయని అన్నారు . కానీ అతి వృష్టి, అకాల వర్షాల కారణంగా పంట చేతికొచ్చే సమయంలో వరి పొలాలు నేలకొరగడంతో ధాన్యం రైతులు నష్టపోయారని లేఖలో వెల్లడించారు. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో అంచనాలు ప్రారంభించి కేంద్రం సాయంతో ఇన్‌పుట్ సాయం అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment