Indemnity
-
లోక్‌అదాలత్‌లో బాధితుడికి రూ.కోటి నష్టపరిహారం
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలోని ఎన్జీవో కాలనీకి చెందిన ఆర్ వీర సుదర్శన్‌రెడ్డికి శనివారం జాతీయ లోక్‌అదాలత్‌లో రూ.కోటి పరిహారం లభించింది. 2015లో ఇంపీరియల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫారమ్స్ సంస్థతో పన్నెండు సెంట్ల స్థలం అగ్రిమెంట్ విషయంలో సుదర్శన్‌రెడ్డికి వివాదముంది. దీనిపై ఆయన జిల్లా కోర్టులో కేసు వేశారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా కోర్టులోని మొదటి బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ సమక్షంలో సంస్థ ప్రతినిధులకు సుదర్శన్‌రెడ్డికి మధ్య రాజీ కుదిర్చారు. సుదర్శన్‌రెడ్డికి రూ.కోటి నష్టపరిహారాన్ని వెంటనే అందేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్‌లో పరిష్కారమైన 1446 కేసులలో ఇంత పరిహారం వచ్చిన కేసు ఇదే కావడం విశేషం. -
ఎకరానికి రూ. 20వేల నష్ట పరిహారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అకాల వర్షాలు, అతివృష్టి వల్ల వరి పంట చాలా దెబ్బతిందని, ధాన్యం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్ మొదట్లో వాతావరణం అనుకూలించలేదని, ఆ తర్వాత వర్షా లు పుంజుకున్నాయని అన్నారు . కానీ అతి వృష్టి, అకాల వర్షాల కారణంగా పంట చేతికొచ్చే సమయంలో వరి పొలాలు నేలకొరగడంతో ధాన్యం రైతులు నష్టపోయారని లేఖలో వెల్లడించారు. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో అంచనాలు ప్రారంభించి కేంద్రం సాయంతో ఇన్పుట్ సాయం అందించాలన్నారు. -
నష్ట పరిహారం.. ఇక 15 శాతం అదనం
సాక్షి, మచిలీపట్నం: ఆపత్కాలంలో అన్నదాతను ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. కళ్లెదుటే కష్టం అంతా వరదార్పణం కావడంతో పుట్టెడు నష్టాల్లో ఉన్న జిల్లా రైతాంగానికి కొండంత భరోసా కల్పించింది. సాధారణంగా విపత్తుల సమయంలో ఇచ్చే నష్ట పరిహారానికి మించి 15 శాతం అదనంగా రైతులకు అందివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్ర పరిశీలన చేసిన అధికారులు ఉద్యాన వన పంటల నష్టంపై ప్రభుత్వానికి తుది నివేదికను అందించారు. ఇక వ్యవసాయ పంటలకు సంబంధించి నేడు తుది నివేదిక సమర్పించనున్నారు. పదేళ్ల తర్వాత కృష్ణా నదికి వచ్చిన వరదల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 10 మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. ఆగస్టు 13వ తేదీన ప్రారంభమైన వరదలు ఏకంగా వారం రోజుల పాటు కొనసాగాయి. దీంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టంపై అధికారులు తుది నివేదికను తయారు చేశారు. వారం రోజుల పాటు క్షేత్ర స్థాయి పరిశీలన వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాయి. 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతు వారీగా పంటలను సర్వే చేశాయి. 33 శాతానికి మించి వాటిల్లిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులు అంచనాలను రూపొం దించారు. ఆ విధంగా జిల్లాలో 1,134 మంది రైతులకు చెందిన 818 హెక్టార్లలో రూ.1.19 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు, 7,051 మంది రైతులకు చెందిన 4021.872 హెక్టార్లలో రూ.7.60కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా లెక్క తేల్చారు. 14 మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. ఉద్యాన పంటలకే అపార నష్టం వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటలకే అపార నష్టం వాటిల్లింది. తోట్లవల్లూరు మండలంలో ఏకంగా 2,382.86 హెక్టార్లు, మోపిదేవి మండలంలో 338.93 హెక్టార్లు, చల్లపల్లి మండలంలో 296.70హెక్టార్లు, అవనిగడ్డ మండలంలో 287.38 హెక్టార్లు, ఇబ్రహీం పట్నంలో 204.16 హెక్టార్లు, కంచికచర్ల మండలంలో 120.95 హెక్టార్లు, చందర్లపాడు మండలంలో 104.05 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన వన పంటల నష్టానికి సంబంధించి తుది నివేదికలను బుధవారం రాత్రికి ప్రభుత్వానికి పంపించారు. వ్యవసాయ పంటలు ఇలా.. వ్యవసాయ పంటల విషయానికి వచ్చేసరికి ప్రాథమిక అంచనాలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ 33 శాతం కంటే ఎక్కువగా నష్టపోయిన పంటలనే పరిగణనలోకి తీసుకోవడంతో నష్ట తీవ్రత తగ్గింది. అలాగే కంచికచర్ల, చందర్లపాడు, తోట్లవల్లూరుల్లో పరిశీలన జరగాల్సి ఉంది. ఇదీ కూడా పూర్తికాగానే.. ప్రభుత్వానికి తుది నివేదిక అందించనుట్లు అధికారులు పేర్కొన్నారు. స్కేల్ ఆఫ్ రిలీఫ్ కంటే 15 శాతం అదనంగా పరిహారం గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.15 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ కింద వరి, వేరుశనగ, పత్తి, చెరకు హెక్టార్‌కు రూ.15వేలు, మొక్కజొన్నకు రూ.12,500, అపరాలు, సన్‌ఫ్లవర్, సోయాబీన్, గోధుములకు రూ.10వేలు, పొగాకుకు రూ.10వేలు, జొన్న, సజ్జలు, రాగులు, సజ్జలు, నువ్వులుకు రూ.6,800, కొర్రా, సామా, వరిగ, మస్టర్డ్ పంటలకు రూ.5వేలు, పొలంలో ఇసుక మేటు వేస్తే రూ.12,200, పంట భూమి కోతకు గురైతే రూ.37,500 చొప్పున చెల్లిస్తారు. ఇక కేంద్రమైతే వర్షాధారమైన భూముల్లో పంటలకు హెక్టార్‌కు రూ.6,800లు, సాగునీటి వనరుల కింద సాగయ్యే పంటలకు రూ.13,500లు, ఇసుక మేట వేస్తే రూ.12,200లు, కోతకు గురైతే రూ.37,500లు చెల్లిస్తుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కేల్ ఆఫ్ రిలీఫ్ కింద చెల్లిస్తున్న మొత్తానికి 15 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో వరద బాధిత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ఉదారంగా ఆదుకున్న సందర్భం లేదని చెబుతున్నారు. ఇదే తొలి అడుగు.. వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధిత రైతులను ఆదుకునేందుకు రూ.3వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని కూడా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. గడిచిన రెండు నెలలుగా కృష్ణా, గోదావరి వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు రావడం నిజంగా ముదవాహమని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత పూర్తి స్థాయి నష్టం వివరాలు ఇలా వ్యవసాయ పంటలు పంట రకం జరిగిన నష్టం(హెక్టార్లలో) పత్తి 493 వరి 119 చెరుకు 127.3 మొక్కజొన్న 53.78 కందులు,పెసలు, మినుములు 25.73 ఉద్యానవన పంటలు పంట రకం జరిగిన నష్టం(హెక్టార్లలో) అరటి 843.682 చింత 1665.906 కూరగాయలు 584.312 కంద 678.514 మామిడి 2.4 బొప్పాయ 89.6 నిమ్మ 0.4 జామ 14.59 తమలపాకు 43.22 పూలతోటలు 9.2 మిరప 89.648 బేర్ యాపిల్ 0.4 నష్టం ఇలా.. ఉద్యాన పంటలు 4,021.872 హెక్టార్లు వ్యవసాయ పంటలు 818 హెక్టార్లు (ఇంకా పెరుగుతుంది) నష్టపోయిన మొత్తం రైతులు 8,185 -
‘సిలికా’ పరిహారంపై సుమోటో పిల్
సాక్షి, హైదరాబాద్: సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం బారిన పడిన వారికి తగిన నష్టపరిహారం అందించాలన్న తమ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదంటూ పత్రిక ల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందిం చింది. ఈ కథనాలను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్లు, కేంద్ర గనుల శాఖ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొంది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరపనుంది. రంగారెడ్డి జిల్లాలోని సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం వల్ల పలువురు మృత్యువాత పడ్డా రు. దీనిపై హైకోర్టులో 2013లో పిల్ దాఖ లైంది. ఈ పిల్ విచారణ సందర్భంగా అప్ప టి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సిలికా బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరోవైపు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ఉస్మానియా ఆస్పత్రికి ఉన్న స్థలా న్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. దీనిపై కూడా సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది. -
రూ.10లక్షలు పరిహారం ఇవ్వాల్సిందే..
టవర్‌సర్కిల్ : తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని, ఆ మొత్తం ఇచ్చే వరకు వదిలేదిలేదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు శనివారం స్థానిక అ న్నమనేని గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రైతులు అధైర్యపడి ఆత్మహత్యలకు పా ల్పడవద్దని, అధికారంలో లేకున్నా అండగా ఉం టామని భరోసాఇచ్చారు. కేసీఆర్ అసమర్థ, అనుభవం లేని పాలనతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ విషయాన్ని ని రూపించకుంటే ముక్కునేలకు రాస్తామని సవాల్‌చేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవ డం లేదని, వారిని ఆదుకునేందుకే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కలిసి ఎన్టీఆర్ సంక్షేమనిధిని ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు రూ.50 వేల కోట్ల సంక్షేమ నిధిని కేటాయించాలని డిమాండ్‌చేశారు. ఇతరపార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదన్నారు. రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చే శారని అన్నారు. రైతులకు గిట్టుబాటుధరలు ఇచ్చినట్లు ప్రభుత్వం నిరూపిస్తే టీడీపీ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని స్పష్టంచేశా రు. డబల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి, రుణమాఫీ, ఫీజురీయింబర్స్‌మెంట్ అంతా మోసమన్నారు. మరో ఆరునెలల్లో కేసీఆర్ బండారం బయటపడి ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉండేందుకు, వారి బాధలను తెలుసుకునేం దుకు బస్సుయాత్ర నిర్వహిస్తే దాన్ని విహారయాత్ర అని మంత్రులు సంబోధించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ సీఎం కాగానే రైతులు కనబడడం లేదని పేర్కొన్నారు. నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గజ్వేల్ ఇన్చార్జి ప్రతాపరెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రభత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు ఉడతాభక్తిగా రైతులకు సాయం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 56 మంది రైతుకుటుంబాలకు చెక్కులు పంపిణీ... జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 56మంది రై తుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున రూ. 28 లక్షల చెక్కులను బాధిత రైతు కుటుంబాలకు అందజేశారు. ఇంకా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు లేఖలు అందుతున్నాయని, వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు బాధిత రైతు కుటుంబాలతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. కార్యాలయం ముందు కలెక్టర్ బయటకు రావాలం టూ నినాదాలు చేశారు. కలెక్టర్ రాకపోవడంతో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు ముఖ్యనేతలు లోనికి వెళ్లి కలిశారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రం సమర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.వి జయరమణారావు, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జీలు పి.రవీందర్రావు, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కర్రు నాగయ్య, సాంబారి ప్రభాకర్‌రావు, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, అన్నమనేని నర్సింగరావు, నాయకులు పుట్ట న రేందర్, కళ్యాడపు ఆగయ్య, అప్జల్, దామెర సత్యం, గాజ రమేశ్ పాల్గొన్నారు. -
నెలరోజుల్లో నష్టపరిహారం ఇవ్వాలి
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: తుపానుల వలన నష్టపోయిన రైతులకు నెలరోజుల లోపు నష్టపరిహారం ఇవ్వాలని, కలెక్టర్ ఆధ్వర్యంలో నష్టపరిహారం అందజేసే అధికారం కట్టబెట్టాలని భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు విజయరామరాజు డిమాండ్ చేశారు. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో బుధవారం నిర్వహించిన అఖిలపక్ష రైతు సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపానులకు నష్టపోయిన రైతులకు ఏడాది తర్వాతగాని పరిహారం అందడం లేదన్నారు. అందువల్ల వారిని ఆదుకునేందుకు బడ్జెట్లో రూ.వేల కోట్లు కేటాయించాలని కోరారు. కోనసీమలో కొబ్బరి తోటల్లో వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. వెంటనే వాటికి కూడా నష్టపరిహారాన్ని అందించాలని, అరటితోటలకు కూడా ఇన్సూరెన్స్‌ను వర్తింపజేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సాధన సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో రైతులను ఆదుకునేందుకు జిల్లా రైస్ మిల్లర్స్ కొంత నిధులు ఇచ్చేవారని, అవి కలెక్టర్ ఆధ్వర్యంలో పంపిణీ జరిగేదన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతుల నుంచి వసూలు చేస్తున్న సెస్ సొమ్ము ప్రభుత్వ ఖాతాకు చేరిపోతుందని, అలా కాకుండా ఎక్కడ వసూలు చేసిన సెస్ అక్కడ రైతులకు నష్టపరిహారంగా అందివ్వాలన్నారు. రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యుడు మెంటే పద్మనాభం మాట్లాడుతూ తుపానుల కారణంగా ఇళ్లు కూలిపోయిన వారికి ఏ విధంగా నష్టపరిహారం అందిస్తున్నామో, అదే విధంగా రైతుకు కూడా వెంటనే పరిహారాన్ని అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు వైట్ల విద్యాధరరావు, భూపతిరాజు పాండురంగరాజు, మేళం దుర్గాప్రసాద్, గాదిరాజు నాగేశ్వరరాజు, నల్లం వెంకట కృష్ణ నాగేశ్వరరావు, లంకా కృష్ణమూర్తి తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం చేసిన తీర్మానాల నివేదికలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు అల్లూరి సత్యనారాయణరాజు, మెంటే సోమేశ్వరరాజు, మల్లారెడ్డి శేషుమోహన రంగారావు, శిరిగినీడి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.