జగిత్యాల, సాక్షి: ప్రాణానికి హాని ఉందని గంగారెడ్డి ముందే చెప్పినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిజామాబాద్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఆయన శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే హత్యకు గురి కావడం విచారకరం. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా భావంతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకున్నాం. 2014లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే జీవన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ పార్టీలోకి వెళ్ళలేదు’’అని అన్నారు.
‘‘ నాకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగింది. కనీసం నాకు చెప్పలేదనేది నా ఆవేదన. గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది. గంగారెడ్డిని వాట్సాప్‌లో బెదిరించినా గానీ పోలీసులు పట్టించుకోలేదు. 100 డయల్ ఫోన్ చేసినా నో రెస్పాన్స్. దసరా పండుగ రోజు డీజేలు పగులగొట్టినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కుట్రలను, వాస్తవాలని వెలికి తీయలేకనే పాత కక్షలు అని పోలీసులు చెబుతున్నారు. నా కుటుంబ సభ్యుణ్ని కోల్పోయా. ఒక నేరస్థుడు పోలిసు స్టేషన్‌లో రీల్స్ తీస్తే పోలీసుల ఏం చేశారు. ఫిరాయింపులతో మేము ఆత్మస్థైర్యం కోల్పోయాం. మా ప్రత్యర్థులు రెచ్చిపోయారు’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment