jagtail
-
‘ప్రాణానికి హాని ఉందన్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు’
జగిత్యాల, సాక్షి: ప్రాణానికి హాని ఉందని గంగారెడ్డి ముందే చెప్పినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిజామాబాద్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఆయన శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే హత్యకు గురి కావడం విచారకరం. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా భావంతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకున్నాం. 2014లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే జీవన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ పార్టీలోకి వెళ్ళలేదు’’అని అన్నారు.‘‘ నాకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగింది. కనీసం నాకు చెప్పలేదనేది నా ఆవేదన. గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది. గంగారెడ్డిని వాట్సాప్‌లో బెదిరించినా గానీ పోలీసులు పట్టించుకోలేదు. 100 డయల్ ఫోన్ చేసినా నో రెస్పాన్స్. దసరా పండుగ రోజు డీజేలు పగులగొట్టినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కుట్రలను, వాస్తవాలని వెలికి తీయలేకనే పాత కక్షలు అని పోలీసులు చెబుతున్నారు. నా కుటుంబ సభ్యుణ్ని కోల్పోయా. ఒక నేరస్థుడు పోలిసు స్టేషన్లో రీల్స్ తీస్తే పోలీసుల ఏం చేశారు. ఫిరాయింపులతో మేము ఆత్మస్థైర్యం కోల్పోయాం. మా ప్రత్యర్థులు రెచ్చిపోయారు’’అని అన్నారు. -
నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేను: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, సాక్షి: జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్నా విరమించారు. ఆయన ఇవాళ పార్టీ నేత గంగారెడ్డి హత్యను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటంతో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో సొంత ప్రభుత్వంపైనే జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విప్ అడ్లూరి లక్ష్మణ్‌పై జీవన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ‘‘ నీకో దండం... నీ పార్టీకో దండం’’ అంటూ లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. జీవన్ రెడ్డికి సీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఫోన్ చేయగా.. ‘‘నేను పార్టీలో ఉండలేను. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారు’’ అని ఫోన్ మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేశారు. ‘‘ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదు. ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహూల్ గాంధీ వరకు కోరుకున్నారు. కానీ, ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ దాన్ని విస్మరించింది. కేసీఆర్ ఏదైతే చేశాడో.. అదే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఆచరిస్తున్నారు. రాహూల్ గాంధీ మన నాయకుడనే విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. నేనెవ్వరికీ భరోసా ఇచ్చే స్థితిలో లేను. నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను’’ అని జీవన్‌రెడ్డి అన్నారు.అంతకు ముందు గంగారెడ్డి హత్యపై కాంగ్రెస్ నేతలు జగిత్యాల-ధర్మపురి రహదారిపై నిరసన చేపట్టారు. రోడ్డుపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ బైఠాయించిన నిరసన తెలిపారు. జగిత్యాలలో 2 గంటలుగా జీవన్‌రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు.పోలీసులకు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సహనం కోల్పోయిన జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో జగిత్యాలలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.జగిత్యాల రూరల్ జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.గంగారెడ్డిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. పాత కక్షలతోనే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: జగిత్యాల: కాంగ్రెస్ నేత గంగారెడ్డి దారుణ హత్య -
నేడు మరోసారి రాష్ట్రానికి అమిత్ షా.. మూడుచోట్ల ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయడంలో భాగంగా సకలజనుల విజయ సంకల్పసభల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు జనగామకు చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు కోరుట్లకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3 నుంచి 3.40 వరకు జరగనున్న ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారు. హెలికాప్టర్లో కోరుట్ల నుంచి బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గంలో ఉప్పల్‌కు చేరుకుంటారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. చదవండి: ఈ ప్రశ్నలకు బదులివ్వండి.. సీఎం కేసీఆర్‌ను నిలదీసిన బండి -
ప్రచార వాహనంపై స్పృహతప్పిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జగిత్యాల: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచార వాహనంలో స్పృహతప్పి పడిపోయారు. రాయికల్ మండలం ఇటిక్యాలలో శుక్రవారం కవిత రోడ్ షోలో పాల్గొన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో ప్రచార వాహనంపై నిలబడి ఉండగా కవిత ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే స్పందించిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్.. కవితకు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే కాసేపటికే కోలుకున్న కవిత తిరిగి ప్రచారం ప్రారంభించారు. డిహైడ్రేషన్ వల్ల ఎమ్మెల్సీ కవిత స్పల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. Sorry for the little scare. I’m doing just well, also happened to have met this sweet little girl and after spending time with her I’m feeling a little more energetic. #KCROnceAgain campaign to resume shortly. ✊🏻 pic.twitter.com/YaO1Siw7Vk — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 18, 2023 చదవండి: Video: ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత -
భారీగా పెరిగిన వరి కోత యంత్రాల అద్దె ధరలు
జగిత్యాల అగ్రికల్చర్: కోతకొచ్చిన పంట చేతికొచ్చే వేళ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.. వరికోత మెషీన్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. ట్రాక్టర్ల బాడుగ భారంగా మారింది. వరికోతలకు వినియోగించే టైర్ హార్వెస్టర్ అద్దె గతేడాది గంటకు రూ.1,800–రూ.2,000 ఉండగా, డీజిల్ ధరలు పెరగడంతో ఈసారి రూ.2,300–రూ.2,500 వరకు యజమానులు పెంచేశారు. పొలాల్లో తడి ఆరక టైర్ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో చైన్ హార్వెస్టర్లను వినియోగించాల్సి వస్తోంది. అయితే ఇవి తెలంగాణలో తక్కువ సంఖ్యలో ఉండటంతో కొందరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి అద్దెకు తీసుకొచ్చి డిమాం డ్‌ను బట్టి గంటకు రూ.3,500– రూ.4,500 వరకు వసూలు చేస్తు న్నారు. ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగైంది. ఈ లెక్కన వరికోతల నిమిత్తం రాష్ట్ర రైతాంగంపై రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముంది. తడిసిమోపెడు..: ఇదివరకు టైర్ హార్వెస్టర్‌తో ఎకరా పొలంలోని వరి పైరును గంటలో కోయిస్తే, ఇప్పుడు పొలాల్లో తేమ కారణంగా గంటన్నర పడుతోంది. హార్వెస్టర్ డ్రైవర్ మామూళ్లతో కలుపుకుని గంటకు రూ.4 వేల వరకు ఖర్చు అవుతోంది. అదే చైన్ హార్వెస్టర్‌తో ఎకరం పైరు కోయిస్తే 2 నుంచి 2.30 గంటల వరకు సమయం పడుతోంది. అంటే.. చైన్ హార్వెస్టర్‌తో కోయిస్తే దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు వస్తోంది. ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లేందుకు ఒక్కో ట్రిప్పుకు గతేడాది రూ.500 ఖర్చు కాగా, ఈసారి దాదాపు రూ.వెయ్యి వరకు పెరిగింది. ధాన్యంలో తేమతోపాటు తప్ప, తాలు ఉందంటూ తిప్పలు పెడుతుండటంతో ఆరబెట్టడం, మెషీన్ల ద్వారా తూర్పార పట్టడం వంటివి చేసేందుకు మరో రూ.2 వేలు –రూ.3 వేలు రైతులు వెచ్చించాల్సి వస్తోంది. హమాలీల కూలీ, లారీ డ్రైవర్ల మామూళ్లు.. ఇలా రైతులపై మోయలేని భారం పడుతోంది. తేమ అధికంగా ఉండే నేలల్లో ఇతర పంటలు పండించే పరిస్థితి లేక వరిసాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఖర్చులు రెట్టింపయ్యాయి వర్షాలకుతోడు సాగునీటి కాలువల ద్వారా నీరు నిరంతరం పారుతోంది. వ్యవసాయ బావుల నుంచి నీరు పైకి ఉబికి వస్తున్నది. దీంతో పొలాలు ఎప్పుడూ తేమగా ఉంటున్నాయి. ఫలితంగా టైర్ హార్వెస్టర్‌తో వరికోసే పరిస్థితి లేదు. నాలుగు ఎకరాల్లోని వరిని చైన్ హార్వెస్టర్‌తో కోయిస్తే, దాదాపు రూ.30 వేలు ఖర్చు వచ్చింది. అంతకుముందు టైర్ హార్వెస్టర్ ఖర్చు రూ.8 వేల –రూ.9 వేలు అయ్యేది. – యాళ్ల గోపాల్‌రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా ఏమీ మిగలడం లేదు రోజూ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం లీటర్ రూ.104–రూ.105 మధ్య ఉంది. రెండునెలలు వరికోతలు ఉంటాయి. మున్ముందు డీజిల్ ధర ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. అందుకే హార్వెస్టర్ అద్దెలు పెంచక తప్పడంలేదు. కరోనా నేపథ్యంలో డ్రైవర్ల జీతాలతోపాటు మరమ్మతు ఖర్చులు రెట్టింపయ్యాయి. మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం కట్టడమే ఇబ్బందిగా మారింది. – శ్రీనివాస్‌రెడ్డి, హార్వెస్టర్ యజమాని, పోరండ్ల -
విందులో ఘర్షణ.. గొడ్డలితో దాడి
మెట్పల్లి (కోరుట్ల) : ఓ విందులో నెలకొన్న గొడవ గొడ్డలితో దాడులు చేసుకునేవరకూ వెళ్లింది. రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు చిన్న విషయమై మాట మాట పెరిగి గొడ్డళ్లతో దాడి చేసుకోగా.. ముగ్గురు గాయపడ్డారు. పట్టణంలోని గాజులపేటకు చెందిన కాపు సంఘం సభ్యులు బుధవారం శివారులోని ఓ తోటలో విందు ఏర్పాటు చేసుకున్నారు. దుగ్గి బుచ్చయ్య, హాన్మాండ్లుకు గోనె అశోక్, రాజిరెడ్డి, లక్ష్మణ్ మధ్య చిన్న విషయంలో వాగ్వాదం జరిగింది. ఇది గొడవకు దారి తీసింది. హన్మాండ్లు అక్కడే ఉన్న సీసాతో రాజిరెడ్డి తలపై కొట్టడంతో అతడు గాయపడ్డాడు. వెంటనే మిగతా సభ్యులు అడ్డుకుని రాజిరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్లిన హన్మాండ్లు కొద్దిసేపటి తర్వాత గొడ్డలితో వచ్చి లక్ష్మణ్, అశోక్‌పై దాడి చేశాడు. ఈ సం ఘటనలో ఇద్దరి తలలకు గాయాలు కావడంతో వారిని కూడా ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలిం చారు. దాడి వ్యవహారంపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పంచాయతీ రాజ్ ఏఈ ఆత్మహత్య
జగిత్యాల: వెల్గటూర్ మండలం ఎండపల్లి శివారులో పంచాయితీరాజ్ ఏఈ దేవి శ్రీకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో శ్రీకాంత్ ఏఈగా పని చేస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 రోజుల క్రితం అదృశ్యమైన శ్రీకాంత్ పత్తి చేను వద్ద గురువారం ఉదయం శవమై కనిపించాడు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటడని భావిస్తున్నారు.