
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయడంలో భాగంగా సకలజనుల విజయ సంకల్పసభల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు జనగామకు చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు కోరుట్లకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3 నుంచి 3.40 వరకు జరగనున్న ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారు. హెలికాప్టర్‌లో కోరుట్ల నుంచి బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గంలో ఉప్పల్‌కు చేరుకుంటారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు.
చదవండి: ఈ ప్రశ్నలకు బదులివ్వండి.. సీఎం కేసీఆర్‌ను నిలదీసిన బండి
Comments
Please login to add a commentAdd a comment