రంగారెడ్డి జట్టుకు మూడో స్థానం | Rangareddy team in third place | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జట్టుకు మూడో స్థానం

Published Fri, Dec 27 2013 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

Rangareddy team in third place

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర పైకా మహిళల హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను అనంతపురం జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో అనంతపురం జట్టు 2-0 స్కోరుతో వైఎస్‌ఆర్ కడప జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా 3-0తో విశాఖపట్నంపై గెలిచింది.
 
  సెమీఫైనల్లో అనంతపురం 4-0తో రంగారెడ్డి జిల్లాపై, వైఎస్‌ఆర్ కడప 2-0తో విశాఖపట్నంపై గెలిచాయి. విజేతలకు హాకీ ట్రిపుల్ ఒలింపియన్ ఎన్.ముఖేష్ కుమార్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ డిప్యూటీ డెరైక్టర్ జి.ఎ.శోభ, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె.నర్సయ్య, హైదరాబాద్ జిల్లా క్రీడాధికారి ఎ.అలీమ్ ఖాన్ తదితరలు పాల్గొన్నారు.
 
 
 రాజు అదుర్స్
 
 జింఖానా, న్యూస్‌లైన్: బ్యాట్స్‌మన్ రాజు (106) సెంచరీతో చెలరేగడంతో తారకరామ జట్టు 14 పరుగుల తేడాతో సాక్రెడ్ హార్ట్స్ జట్టుపై గెలుపు దక్కించుకుంది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన తారకరామ 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. శేఖర్ 35 పరుగులు చేశాడు. తర్వాత బరిలోకి దిగిన సాక్రెడ్ హార్ట్స్ 188 పరుగుల వద్ద ఆలౌటైంది.
 
 జమీర్ (40), జెరాద్ (43) మెరుగ్గా ఆడారు. తారకరామ బౌలర్లు సిద్ధార్థ్, తరుణ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో హెచ్‌యూసీసీ బౌలర్ బిలాల్ అహ్మద్ (5/19) తన బౌలింగ్‌తో ఇంపీరియల్ జట్టును కట్టడి చేశాడు. దీంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఇంపీరియల్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంపీరియల్ 180 పరుగులు చేసి ఆలౌటైంది. ఉత్తేజ్ (56) అర్ధ సెంచరీతో రాణించగా... అర్ఫాన్ (42) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బరిలోకి దిగిన హెచ్‌యూసీసీ 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి నెగ్గింది. ఇబ్రహీమ్ (76) అర్ధ సెంచరీతో చెలరేగగా... అతీఖ్ 30 పరుగులు చేశాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఎంపీ యంగ్‌మెన్: 215/6 (ఆదర్శ్ 41, ఉదయ్ 43, శ్రీవంత్ 44; అభిషేక్ 4/16); సెయింట్ ప్యాట్రిక్స్: 161/9 (అభిషేక్ 52).
 
  పీకేఎంసీసీ: 235/9 (జయేష్ 50, కుమార్ 44, విజయ్ 40, మణికాంత్ 33; శ్యామ్ 5/50); విజయ్ సీసీ: 212/9 (సుధాకర్ 76 నాటౌట్, కిరణ్ 43, భార్గవ్ 35; కుమార్ 3/13).
 
  హైదరాబాద్ పాంథర్స్: 155 (హైదర్ 32, రేహాన్ 34 నాటౌట్; శ్రీకాంత్ 3/22); డబ్ల్యూఎంసీసీ: 156/4 (ప్రదీప్ 63 నాటౌట్, హర్యాంక్ 30; విలాయత్ 3/26).
 
  స్టార్లెట్స్: 178 (అజయ్ జశ్వంత్ 40; కేసరి 4/28); యూనివర్సల్: 111.
 
 యాదవ్ డెయిరీ: 164 (మహ్మద్ 55, శ్రీనాథ్ 35, స్వామి 3/11); ఎంపీ బ్లూస్: 168/2 (విక్రమ్ 41 నాటౌట్, స్వామి 35 నాటౌట్).
 
  పీఎన్ యంగ్‌స్టర్స్: 138 (జావిద్ 40; ప్రకాష్ 3/40); సూపర్‌స్టార్: 139/3 (మహేష్ 51, రాకేష్ 31).
 
 మయూర సీసీ: 197/9 (ఆశిష్ శ్రీవాస్తవ్ 46, అఖిలేష్ 44 నాటౌట్ , రిషబ్ 37; మహ్మద్ ఐజాజ్ 5/17); ఆడమ్స్ ఎలెవన్: 52 (సంజయ్ 3/11, అఖిలేష్ 3/10).
 
  ధృవ్ ఎలెవన్: 161 (సంపత్ 41, అశోక్ 31; భార్గవ్ ప్రసాద్ 3/22); గగన్‌మహల్: 112 (కిరణ్ 34; సంపత్ 3/13, మోహన్ 3/31).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement