కొప్పుల ఈశ్వర్, క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 5 లోగా జిల్లా కేంద్రాలకు క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌లు పంపించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి క్రిస్మస్ వేడుకల నిర్వహణ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ పండగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ హాజరయ్యే విందు కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రముఖ క్రిస్టియన్ అవార్డులను అర్హత గల 12 మందికి, 6 సంస్థలకు ఇవ్వాలని సూచించారు. క్రిస్టియన్ భవన్‌కు పునాది రాయి వేయడానికి అవసరమైన ఏర్పాట్లు వచ్చే నెల 20 కల్లా పూర్తవుతాయన్నారు. 63 ఎకరాల భూమిని శ్మశాన వాటికల ఏర్పాటుకు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. వీటిని వెంటనే మైనార్టీ సంక్షేమశాఖకు అప్పగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, టీఎస్‌ఎంసీ వైస్ చైర్మన్ బి.శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment