koppula eswar
-
మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా రాజకీయం భవిష్యత్తులో రసవత్తరంగా మారనుంది. జిల్లా కేంద్ర నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాపై బీజేపీ రాష్ట్ర నేతలు గానీ, ఎంపీ అర్వింద్ గానీ దృష్టి సారించడంలేదనే ఆరోపణ వినిపిస్తోంది. కేవలం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంపీ గెలిచినా పార్టీ పటిష్టం కాలేదు. జగిత్యాలకు ప్రత్యేక స్థానం రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల సీటు ప్రత్యేక స్థానం పొందింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్‌నేత జీవన్ రెడ్డి ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని భారీ మెజార్టీతో సాధించుకున్నారు జీవన్‌రెడ్డి. టీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోరు ఎమ్మెల్యే సంజయ్‌కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నియోజకవర్గ పర్యటనలకు, నిరసనలకు మినహా పార్టీ బలోపేతంపై దృష్టిసారించకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారనుంది. చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా? జగిత్యాల నుంచి పోటీకి ఆ ఇద్దరి ప్రయత్నాలు అయితే సంజయ్ కుమార్ ఈసారి టీఆర్ఎస్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని ఇద్దరు ముఖ్య నేతలు తామే ఎమ్మెల్యే అభ్యర్ధులమని ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత ఎల్. రమణ టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కూడా జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. బీజేపీ సైతం ఉనికి పోరాటాలకే పరిమితం అయ్యిందని రాజకీయ విశ్లేషకుల వాదన. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచాక జగిత్యాల కూడా అందులో ఉండటంతో కొంత జోష్ పెరిగినా వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. కొడుకును రంగంలోకి దింపనున్న విద్యాసాగర్ కోరుట్లకు విద్యాసాగర్ రావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కోరుట్ల నుంచి విద్యాసాగర్ తన కుమారుడు సంజయ్‌ను పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే సంజయ్ హైదరాబాదులో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఎన్నికల వాతావారణం రావడంతో సంజయ్ ఇప్పటినుంచే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేతలు మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్ది రాములు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు నర్సింగరావు పోటీకి రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన జేయన్ వెంకట్ టికెట్టు ఆశిస్తున్నారు. చదవండి: గుజరాత్లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్‌దే విజయం.. టీఆర్ఎస్లో కుమ్ములాటలు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం ధర్మపురికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్లో స్థానికంగా కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి మీద కొప్పుల ఈశ్వర్వి జయం సాధించారు. కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓటమి పాలైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎలాగైనా ఈసారైనా ఈశ్వర్‌ను ఓడించాలని లక్ష్మణ్ కుమార్పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు. కొప్పుల ఈశ్వర్‌కు తలనొప్పి టీఆర్ఎస్లో వర్గ విభేదాలు కొప్పుల ఈశ్వర్‌కు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం లింక్ 2 లో భాగంగా పైపులైన్ వేసిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం తక్కువగా ఉందని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. రోడ్ల వెడల్పులో ఇళ్ళు కోల్పోయినవారికి పరిహారం అందక వారు అధికార పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 15 వార్డుల్లో టీఆఆర్ఎస్ ఎనిమిది, కాంగ్రెస్ ఏడు వార్డులు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు తరువాత బీజేపీలో చేరిన గడ్డం వివేక్‌కు రెండు పార్టీల కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ధర్మపురిలో బీజేపీ తరపున నిలిచి గెలవాలని ఆయన ఆశిస్తున్నారు. -
మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం
-
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి అంత్యక్రియలు
సాక్షి, గోదావరిఖని(రామగుండం): ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య పార్థివదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్య సమస్యతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా నర్సయ్య పార్థివదేహాన్ని బుధవారం గోదావరిఖని కాకతీయనగర్‌లోని ఇంటివద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ చేరుకొని పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ నివాళి అర్పించారు. అనంతరం మాతంగి అంతిమయాత్రలో పాల్గొన్నారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మాతంగి నర్సయ్య నాలుగుదశాబ్దాలుగా తనకు సుపరిచితులన్నారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అన్నారు. ఈ ప్రాంతం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక సమస్యలు పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రామగుండం కార్పొరేషన్ మేయర్ అనిల్‌కుమార్, డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్, ఆర్ఐ శ్రీధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
దివ్యాంగులు, వృద్ధుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో దివ్యాంగులు, వృద్ధులకు అత్యవసర సేవలందించేందుకు రాష్ట్ర దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ ఏర్పాటు చేసింది. దివ్యాంగుల కోసం 1800 5728980, వృద్ధుల కోసం 14567 టోల్‌ఫ్రీ నంబర్లను ఆ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం తన క్యాంపు ఆఫీసులో ప్రారంభించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందేందుకు నిర్దేశిత కార్యాలయానికి వెళ్లేవారికి, ఇంకా అత్యవసర సేవలు అవసరమైనవారికి ఈ టోల్‌ఫ్రీ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. సహాయకులకు పాస్‌లు జారీ: దివ్యాంగులు, వృద్ధులకు సహాయకులుగా ఉండే వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా పాసులు ఇవ్వనుంది. అత్యవసర సమయంలో సహాయకులను తీసుకెళ్లేందుకు వీలుగా వీటిని వినియోగించుకోవచ్చు. దివ్యాంగులు/వృద్ధులు సూచించిన వారికి పాసులు జారీ చేయాలని సదరు మంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. -
డిసెంబర్ 5లోగా జిల్లాలకు క్రిస్మస్ గిఫ్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 5 లోగా జిల్లా కేంద్రాలకు క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌లు పంపించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి క్రిస్మస్ వేడుకల నిర్వహణ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ పండగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ హాజరయ్యే విందు కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రముఖ క్రిస్టియన్ అవార్డులను అర్హత గల 12 మందికి, 6 సంస్థలకు ఇవ్వాలని సూచించారు. క్రిస్టియన్ భవన్‌కు పునాది రాయి వేయడానికి అవసరమైన ఏర్పాట్లు వచ్చే నెల 20 కల్లా పూర్తవుతాయన్నారు. 63 ఎకరాల భూమిని శ్మశాన వాటికల ఏర్పాటుకు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. వీటిని వెంటనే మైనార్టీ సంక్షేమశాఖకు అప్పగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్, టీఎస్ఎంసీ వైస్ చైర్మన్ బి.శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రులకు చేదు అనుభవం
-
మంత్రులకు చేదు అనుభవం
సాక్షి, జగిత్యాల : మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్లకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం హిమ్మత్ రావు పేటకు వెళుతున్న మంత్రుల వాహనాలను రాంసాగర్ చౌరస్తా వద్ద కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు, రైతులు అడ్డుకున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంటనే పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆరు కుటుంబాలకు రావలసిన పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలని రోడ్డుపై బైటాయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని ఆందోళన చేపట్టారు. 15 నిమిషాల పాటు మంత్రుల వాహనాలను ఎటూ కదలనీయకుండా అడ్డగించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య మంత్రులు హిమ్మత్ రావు పేటకు బయలు దేరారు. -
హాస్టల్లో పేలిన సిలిండర్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌లో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం లో సోమవారం సిలిండర్ పేలింది. దీంతో రేకులషెడ్డు, భవనం కాంపౌండ్‌వాల్ కూలిపోయాయి. కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ప్రిన్సిపాల్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వసతి గృహంలో 400 మంది విద్యార్థినులున్నారు. సాయంత్రం వంటమనిషి అనసూర్య వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ మాధవికి విషయం చెప్పింది. అప్రమత్తమైన ఆమె విద్యార్థినులను వెంటనే బయటకు వెళ్లాలని సూచించడంతో వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఇంతలోనే భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మిగతా సిలిండర్లను తొలగించారు. భయాందోళనతో కన్నీరుమున్నీరవుతున్న విద్యార్థినులను వారు ఓదార్చారు. బాధ్యులపై చర్యలు: కొప్పుల ఘటన స్థలాన్ని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం రాత్రి సందర్శించారు. ఘటన జరిగిన తీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
'చైనా మాదిరిగా ఉద్యమం చేపట్టాలి'
సాక్షి, మంథని : ‘చైనాలో పర్యావరణ విపత్తు సంభవించినప్పుడు అక్కడి ప్రభుత్వం చాలెంజ్‌గా తీసుకుంది. 600 కోట్ల మొక్కలు నాటి గ్రేట్ గ్రీన్ ఆప్ చైనాగా సమస్యను పరిష్కరించుకుంది. పర్యావరణ సమతుల్య సాధనకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యో రామగుండంలో అదే మాదిరిగా ఉద్యమం చేపట్టాలి’ అని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సింగేరేణి సంస్థ ఆర్జీ– 3, అడ్రియాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంథని మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలవాగు కరకట్టపై హరితాహారం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మంత్రి కొప్పులతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు, పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే డి. శ్రీధర్ బాబు, సింగరేణి సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ వనజాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కరకట్టపై మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. మానవ మనుగడకు ముడిపడి ఉన్న పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా అడవులశాతాన్ని పెంచేందుకు 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు. నాలుగు విడతల్లో నాటిన మొక్కల్లో 48శాతమే మిగిలాయని, సింగరేణి గనులు విస్తరించి ఉన్న రామగుండం అగ్నిగుండంలా మారిందన్నారు. ఇక్కడ ఆ పరిస్థితులు అధిగమించడానికి సింగరేణి అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో కోటి 95లక్షల మొక్కలు నాటడం టార్గెట్‌గా ఉందని, ఇప్పటి వరకు25 లక్షల మొక్కలే నాటారన్నారు. కోతులు గ్రామాలకు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అడవికి పంపేందుకు జగిత్యాల జిల్లా మాదిరిగా ఇక్కడా చర్యలు చేపట్టాలని తెలిపారు. సింగరేణి, నీటి పారుదలశాఖల పరిధిలో భూములు కోల్పోయిన వారి సమస్యల సాధనకు కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మంథని మున్సిపాలిటీలో ఇంత పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన సింగరేణికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు. సింగరేణి సంస్థ డైరెక్టర్(పా)చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండేళ్లలో రెండు కోట్ల మొక్కలు నాటామన్నారు. సింగరేణి కాలరీస్ పరిధిలో స్థలాలు లేకపోవడంతో మున్సిపల్, మేజర్ పంచాయతీల్లోనూ మొక్కలు నాటుతున్నామన్నారు. మంథని ఆర్డీవో నగేష్, మంథని ప్రత్యేక అధికారి బోనరిగి శ్రీనివాస్, సింగరేణి గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, జనరల్ మేనేజర్లు సూర్యనారాయణ, వీరారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’ తొలి ఫలితం జిల్లాకే..
సాక్షి, పెద్దపల్లిరూరల్: పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ సారథ్యంలోనే ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలోని కోటి ఎకరాల మాగాణికి సాగునీరందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మహాయజ్ఞంలా నీటి పథకాలకు శ్రీకారం చుట్టారని, గడిచిన ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో చేపట్టిన పలు పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించేలా కేసీఆర్ రూపకల్పన చేశాడన్నారు. రైతాంగానికి అవసరమైన సాగునీటిని నిరంతరం అందించేందుకు రాష్ట్రంలో 23భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి పూర్తి చేసే స్థాయికి చేరిందన్నారు. గోదావరి నదినే మళ్లించాం.. ఇంతకాలం గోదావరి నదిలో మిగిలిన నీరంతా సముద్రంలో వృథాగా కలిసిపోయేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ సభ్యులకు వివరించారు. ఆ వృథా నీటిని సముద్రంలోకి పోకుండా రైతాంగానికి ఉపయోగపడేలా చూడాలనే మంచి ఆలోచనతోనే కాళేశ్వరం ప్రాజెక్టును యజ్ఞంలా చేపట్టామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కువగా చేయడంతో ఆ వైపు నుంచి ఎస్సారెస్పీకి చుక్కనీరు రాని పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా నీటిని మళ్లిస్తున్నామంటే గోదావరి నదికి మళ్లించినట్లేనని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు ఆశించిన స్థాయిలో జరుగడం లేదని తుదిగడువుకల్లా ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ శ్రీదేవసేనకు మంత్రి సూచించారు. సాగునీటిపై రగడ.. జిల్లాలో పంటల సాగు, రైతాంగ సమస్యలపై ఓదెల జెడ్పీటీసీ గంట రాములు ప్రశ్నలు లేవనెత్తడం.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రతీసారి సాగునీటిపై మాట్లాడం ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం సాగునీటి రగడకు కారణమైంది. సభలో ఈ అంశంపైనే అరగంటకు పైగా చర్చ జరిగింది. పంటల సాగుకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, పంట సాగు చేయాలా వద్దా, కాళేశ్వరం నీళ్లు వస్తాయో లేదో తెలియదని, జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉండడంతో ఆందోళనలో రైతులున్నారని గంట రాములు ప్రస్తావించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆరుగురు రైతులకు ఇప్పటికీ పరిహారం అందించలేదని, ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకుంటారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎస్సారెస్పీలో నీళ్లుంటెనే పారుతాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సాగునీటిపై రాద్ధాంతం చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. రైతాంగ సంక్షేమంపై ఏదో పెద్ద ఆపేక్ష ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. పైద్దపల్లి నియోజకవర్గంలో కాలువ చివరి భూములకు సాగునీరందించేందు కు కాలువల వెంట తిరిగి రైతులకు అండగా ని లిచామని మనోహర్‌రెడ్డి వివరించారు. సాగునీ టి లభ్యత లేదంటూ వరిపంటను సాగు చేసుకో వద్దంటూ గ్రామాల్లో ప్రచారం చేయాలంటూ వ్యవసాయాధికారికి గంట రాములు సూచించడంతో సుల్తానాబాద్ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మ నోహర్‌రెడ్డి సాగునీటిని రైతులకు అందించాలని పరితపిస్తే, ఇన్నాళ్లు ఇంట్లో నిద్రపోయి ఇపుడు మాట్లాడుతారా అంటూ నిలదీశారు. జెడ్పీటీసీ పుట్ట మధు, మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకుని సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మహాయజ్ఙంలా సా గుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ ఎన్ని ప్రయత్నాలు చే సిందో ప్రజలందరికీ తెలిసిందేనని, ఇకనైనా ఇ లాంటి పద్ధతులు మాని ప్రభుత్వం చేపట్టే మం చి పథకాల అమలుకు సహకరించాలన్నారు. అ యితే తాను ఎలాంటి దురుద్దేశ్యంతో మాట్లాడలేదని రాములు సర్ది చెప్పేందుకు యత్నించారు. వ్యవసాయంపై మొదలై.. ప్రాజెక్టుల వైపు మళ్లిన చర్చ పెద్దపల్లి జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుపై మొదలైన చర్చ ప్రాజెక్టుల వైపునకు మళ్లింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరినాట్లు ఆశించినస్థాయిలో జరగకపోయినా ఆగస్టు15 నాటికల్లా వేసుకునేందుకు అవకాశముందని, ఇందుకు పలురకాల స్వల్పకాలిక విత్తనాలున్నాయని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ సభ్యులకు వివరించారు. సబ్సిడీ విత్తనాల పంపిణీకి 42కేంద్రాలను ఏర్పాటు చేసి 10,692 క్వింటాళ్ల విత్తనాలను అందించామని వివరించారు. బయోమందుల అమ్మకాలు జరిగినట్టు తమ దృష్టికి వస్తే వాటిని వెనక్కి పంపించామని పేర్కొన్నారు. రైతుబీమా పథకం కింద 256మందికి రూ.12కోట్ల30లక్షలను పదిరోజుల్లోనే జమ చేయించామన్నారు. రైతుబంధు పథకం జిల్లాలో కోటి 25లక్షల మందికి వర్తింపజేయగా 70వేల మంది రైతుల ఖాతాకు జమ అయ్యాయన్నారు. -
భావోద్వేగానికి లోనైన ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరిని కలుపుకొని వెళ్తానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. ‘ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని అన్నారు కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదు. చంద్రబాబు నన్ను మంత్రిని చేస్తానని మాటతప్పారు. కేసీఆర్ నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వరంగల్ జిల్లాకు పెండింగ్ లో ఉన్న రింగ్ రోడ్డు, టెక్స్ టైల్ పార్కు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేచ్చేందుకు కృషిచేస్తా. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకొని వారి అనుభవంతో ముందుకు వెళతా. వరంగల్ ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటాన’ని ఎర్రబెల్లి అన్నారు. అరుదైన గౌరవమని: కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కడం ఆనందంగా ఉందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉద్యమ నాయకుడిగా తనకిది అరుదైన గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన మీద పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి జవాబుదారిగా పనిచేస్తానని చెప్పారు. (నేడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ) కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఇంద్రకరణ్ రెడ్డి తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామన్నారు. కార్యకర్తల కృషి వల్లే తనకు మంత్రి పదవి దక్కిందన్నారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖ అప్పగించిన శిరసావహిస్తానని స్పష్టం చేశారు. -
మంత్రులెవరో..!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో అదే రోజు ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో సమావేశం కావడంతో కేబినెట్ కూర్పు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మళ్లీ మంత్రివర్గ విస్తరణపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర రెండో కేబినేట్లో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి..? ఉమ్మడి జిల్లా నుంచి ఎవరెవరికి మంత్రివర్గంలో బెర్త్ దొరుకుతుంది...? మన ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులు ఎవరిని వరించి వస్తాయి..? అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం నుంచి అంకితభావంతో పనిచేసి అధినేత విశ్వసనీయత చూరగొన్న నేతలకు ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందన్న చర్చ మరోవైపు జరుగుతోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్.. హోంమంత్రి మహమూద్ అలీలతో పాటు కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉన్నా... ప్రభుత్వ శాఖల మథనం, కుదింపు, విలీనం తదితర అంశాలతో ముడిపడటం వల్ల జాప్యం అయ్యిందంటున్నారు. డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలుపొం దింది. అదే నెల 13న కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇది జరిగి సుమారు రెండు మాసాలు పూర్తి కాగా... ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు 19న ముహుర్తం కుదరడంతో రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ విడతలో ఇద్దరా? ముగ్గురా? ఈసారి విస్తరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి చోటిస్తారా? లేక ముగ్గురిని తీసుకుంటారా? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి మాజీ ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌లతో పాటు మాజీ విప్ కొప్పుల ఈశ్వర్ మంత్రి రేసులో ఉన్నారు. అయితే ఈసారి కేబినెట్ కూర్పుపై భిన్నమైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మాత్రమే కేబినెట్లో ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో 16 మందికి అవకాశముంది. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసారి విస్తరణలో 16 మందిని తీసుకోకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొంత మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుని మిగతా వారికి లోక్‌సభ ఎన్నికల తర్వాత చోటు కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికే ఈ విస్తరణలో అవకాశం దక్కనుంది. ప్రస్తుతం మాజీ మంత్రులుగా ఉన్న హుజూరాబాద్, సిరిసిల్ల ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, కేటీఆర్‌లకు ఈ విడతలో ఛాన్స్ ఉంటుందంటున్నారు. మరోమారు విస్తరణలో మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను మంత్రివర్గంలో చేర్చుకుంటారంటున్నారు. మొత్తం 16 మందిని ఈ విడతలోనే తీసుకుంటే.. ఈటల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌లను మంత్రి పదవులు వరించనున్నాయి. శాఖల మార్పులుంటాయా..? మంత్రివర్గంలో ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించనున్నారనే అంశపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీలు ప్రమాణ స్వీకారం చేయగా, అమాత్యుల రేసులో ఉన్న మరో సీనియర్ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్‌గా నియమించారు. నలుగురు మంత్రులు ఈసారి ఎన్నికల్లో ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నా... ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురికి కూడా ఈసారి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. అయితే ఈసారి కొందరి శాఖల మార్పులు ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌లలో ఎవరెవరికి.. ఏ శాఖ కేటాయిస్తారనేది కూడా చర్చనీయాంశమే అయ్యింది. ఈ విషయమై అధినేత కేసీఆర్ ఏం యోచిస్తున్నారు? అయన మదిలో ఏముంది? అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. కేటీఆర్, ఈటల రాజేందర్‌లకు పాత శాఖలే కేటాయిస్తారా? లేక ప్రచారంలో ఉన్నట్లు మార్పులు, చేర్పులు చేసి ఇస్తారా? అన్న అంశాలు ప్రజలు, పార్టీ నేతలతో పాటు మంత్రి రేసులో ఉన్నవారిని సైతం ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపులపై త్వరలోనే సస్పెన్స్ వీడుతుందని పార్టీకి చెందిన కొందరు సీనియర్లు అంటున్నారు. -
టీఆర్ఎస్లో పెద్దపల్లి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనం తరం టీఆర్ఎస్లో కొత్త పంచాయితీలు మొదలవుతున్నాయి. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ స్థానాల్లో మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్కు నష్టం కలిగించేలా వ్యవహరించారని ఎమ్మెల్యే లు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంపై పలువు రు ఎమ్మెల్యేలు నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్(ధర్మపురి), దాసరి మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి), బాల్క సుమన్(చెన్నూరు), సోమారపు సత్యనారాయణ(రామగుండం) గురువారం తెలం గాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు, తమకు ఇబ్బంది కలిగించేలా వివేక్ వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ ఇద్దరూ కలిసి, సోమారపు సత్యనారాయణ వేరుగా కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వివేక్ టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారని... బెల్లంపల్లిలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడు వినోద్‌కు సహకరిం చారని కేటీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇటీవల జరిగిన టీఆర్ఎస్ కృతజ్ఞత సభలోనూ పలువురు ద్వితీయశ్రేణి నేతలు ఎంపీ వివేక్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ధర్మపురి, బెల్లంపల్లి, చెన్నూరులో బహిరంగంగానే వివేక్‌పై విమర్శలు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ వివేక్ సైతం గురువారం కేటీఆర్‌ను కలిశారు. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఎన్నికల పరిస్థితులపై కేటీఆర్‌తో మాట్లాడారు. తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో టీఆర్ఎస్కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని వివేక్ కేటీఆర్‌కు వివరించినట్లు తెలిసిం ది. ఫిర్యాదులు, వివరణ నేపథ్యంలో పెద్దపల్లి లోక్‌సభ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలతోపాటు మాజీ ఎంపీ వివేక్‌తో కేటీఆర్ శుక్రవారం మరోసారి భేటీ కానున్నట్లు తెలిసింది. -
జగిత్యాల: ప్రతీ పల్లె వికసించాలన్నదే నా కల
‘ప్రచారం కోసం నేను ఏ పల్లెకు వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. ఈసారి కారుగుర్తుకే ఓటేస్తామంటున్నరు. నాపై పూర్తి విశ్వాసంతో మళ్లీ గెలిపించుకుంటామని తీర్మానాలు చేస్తున్నరు. కేసీఆర్ ఆశీస్సులతో నాలుగేళ్లలో రూ.1,230 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గెలిచి.. మరింత అభివృద్ధి చేస్తా. ప్రతీ పల్లెను వికసింపజేసి.. అన్ని మండలాలను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేయాలన్నదే నా ధ్యేయం’ అని టీఆర్ఎస్ ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొప్పుల ఐదోసారి ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సౌమ్యుడు.. స్నేహశీలిగా పేరొందిన కొప్పుల ఎన్నికలలో ప్రచారం ఎలా చేస్తున్నారు? ప్రజల స్పందన.. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి? అధికారంలోకి వస్తే చేయనున్న పనులపై ఆయన మాటల్లోనే... – సాక్షి, జగిత్యాల సాక్షి, జగిత్యాల: నియోజకవర్గంలో దాదాపు 70వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రాజెక్టులు, లిఫ్టులు, కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ధర్మపురి, బీర్పూర్ మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 30 వేలకు పైగా ఎకరాలకు తాగు, సాగునీరందించేలా బీర్పూర్ మండలంలో రోళ్లవాగు ప్రాజెకుŠట్ నిర్మాణ, ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆరు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. కొనసాగుతున్న బొల్లిచెరువు ఆధునికీకరణ పనులతో మరో 5వేల ఎకరాలకు సాగునీరందనుంది. వీటితోపాటు నియోజకవర్గ పరిధిలోని స్తంభంపల్లి, వెల్గటూరు, జగదేవ్‌పూర్, దమ్మన్నపేట, అక్కపల్లిలో లిఫ్ట్‌ల పనులు జరుగుతున్నాయి. రంగదామునిపల్లి బైపాస్ కెనాల్, పత్తిపాక బొమ్మెనపల్లి కాలువ, మద్దులపల్లి లింగాపూర్, అంబరిపేట కాలువ విస్తరణ పనులు జరుగుతున్నాయి. రూ.7 కోట్లతో మేడారం తూముల ద్వారా వెల్గటూరులోని 11 గ్రామాలకు సాగునీరందించేలా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.5 కోట్లతో 31 చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మళ్లీ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే కొనసాగుతున్న పనులు పూర్తి చేయడంతోపాటు నియోజకవర్గంలో మరో 30 వేల ఎకరాలకు సాగునీరందించేలా పనులు చేస్తా. ధర్మపురి టెంపుల్ సిటీ సమైక్యవాదుల పాలనలో తెలంగాణలోని అన్ని దేవాలయాలు ఆదరణకు నోచుకోలేకపోయాయి. ముఖ్యంగా దక్షిణకాశీగా పేరొందిన ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయానిదీ ఇదే పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించడంతో(కొంతభాగం)పాటు టెంపుల్ సిటీలా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నం. ఇప్పటికే రూ.50 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఆ నిధులతో ఎలాంటి పనులు చేపట్టాలి? ఇంకెన్ని నిధులు అవసరం? అనే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నం. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. ఏడాదిలోగా లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని టెంపుల్‌సిటీగా మారుస్తా. ఇదే క్రమంలో ధర్మపురి నుంచి మురుగునీరంతా పవిత్ర గోదావరిలో చేరుతున్నాయి. వచ్చిన నిధుల్లోంచి రూ.6 కోట్లతో గోదావరి నది ప్రక్షాళన చేయబోతున్నాం. కొత్త కొత్తగా ! మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడమే కాకుండా పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.25 కోట్లు మంజూరు చేసుకున్నాం. ధర్మపురిలో రూ.కోటితో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించుకోబోతున్నాం: ధర్మపురిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం, పెగడపల్లి, వెల్గటూరులో జ్యోతిబాపూలే, ధర్మపురిలో మైనార్టీ బాలికల, గొల్లపల్లిలో ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయించుకున్నాం. ధర్మపురిలో డిగ్రీ, గొల్లపల్లి, వెల్గటూరులో జూనియర్ కాలేజీ మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. కొత్తగా బుగ్గారం మండలాన్ని మంజూరు చేసుకున్నం. 21 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకున్నం. రూ.37 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు నిర్మించుకున్నాం. ముఖ్యంగా పెగడపల్లి నుంచి గుండి, వెల్గటూరు నుంచి కల్లెడ, చిల్వకొడూరు నుంచి ఐతుపల్లి, రాష్ట్ర రహదారి– 7 నుంచి మల్లాపూర్ వరకు, ధర్మారం నుంచి బొమ్మారెడ్డిపల్లి, అప్రోచ్ రోడ్డు నుంచి బానంపల్లి, పాతగూడురు నుంచి మేడారం, శానబండ నుంచి గొడిసెలపేట వరకు, గొల్లపల్లి నుంచి మల్లన్నపేట, వెంగళాపూర్ నుంచి గుట్టలపల్లి, బీర్సాని నుంచి మద్దనూరు వరకు, జైన నుంచి తీగలధర్మారం వరకు రోడ్ల నిర్మాణాలు చేపట్టుకున్నం. గుంజపడుగు, పాతగూడురు, దీకోండ, మ్యాకవెంకయ్యపల్లి, బుచ్చయ్యపల్లి, తిరుమలాపూర్, శెకల్లా, ఐతుపల్లి, ల్యాగలమర్రిలో వంతెన నిర్మాణాలు జరిగాయి. కొత్తగా ఎనిమిది విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించుకున్నాం. -
జవాబుదారి తనంతో పనిచేస్తా
ధర్మారం: ఎమ్మెల్యేగా ప్రభుత్వ చీఫ్‌విప్‌గా జవాబుదారితనంతో పనిచేస్తా మరోకసారి అవకాశం ఇవ్వండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ధర్మపురి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పెర్కపల్లి, బొమ్మారెడ్డిపల్లి గ్రామాలలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. పెర్కపల్లి, బొమ్మారెడ్డిపల్లి గ్రామాలలోని మహిళలు ఈశ్వర్‌కు ఘన స్వాగతం పలికారు. మహిళలు కోలాటం, ఓగ్గుడోలు కళాకారులు నృత్యాలతో గ్రామంలో ర్యాలీగా వెళ్లారు. ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర నాలుగున్నర ఏళ్లల్లో అన్ని రంగాల ప్రజలకు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ పుస్కూరి నర్సింగరావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పెంచాల రాజేశం, ముత్యాల బలరాంరెడ్డి, చింతల జగన్మోహన్రెడ్డి, పాక వెంకటేశం, భాస్కర్‌నాయక్, గంగిపెల్లి కోమురయ్య, టీఆర్ఎస్ నాయకులు సత్తరవెని సది, పంబాల అయిలవ్వ, గంగిపెల్లి నర్సయ్య, అచ్చె సత్తయ్య, చిమ్మల చిన్న రాజయ్య, మెడవేని పెద్దులు, కట్ట స్వామి, మద్దునాల వెంకటేశం పాల్గొన్నారు. -
కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం : ఒకరి మృతి
కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లోని గోదావరిఖని బైపాస్ రోడ్డులో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ వాహనాన్ని మరోకారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కుందారపు గోపాల్ మరో వ్యక్తితో కలసి కరీంనగర్ వైపు ఆల్టో కారులో వస్తున్నాడు. కరీంనగర్ హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద కొప్పుల ఈశ్వర్ డ్రైవర్ యూ టర్న్ తీసుకుంటుండగా గోపాల్ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో గోపాల్ కారులోనే మృతిచెందాడు. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఈశ్వర్ కారులో లేరు. -
కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం : ఒకరి మృతి
-
చర్చించడం వారికి ఇష్టం లేనట్టుంది
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ తీరు విచిత్రంగా ఉందని, సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడం చూస్తుంటే సభలో చర్చించడం వారికి ఇష్టం లేదని అర్థమవుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సమావేశాల్లో చర్చించడానికి కాంగ్రెస్ దగ్గర సబ్జెక్ట్ లేదన్నారు. సోమవారం మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ఎన్ని రోజులైనా సభ జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ సభా సంప్రదాయలను పట్టించుకోవడం లేదన్నారు. -
అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యమా?
హైదరాబాద్: తెలంగాణను అప్పుల రాష్ట్రం అని మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించటం తగదని చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పులు చేయలేదా? అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యమా? అని ప్రశ్నించారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఓ ఆకతాయిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే టీఆర్ఎస్కు చివరి బడ్జెట్ అని రేవంత్ అనడం సిగ్గుచేటని తెలిపారు. టీడీపీని తెలంగాణ ప్రజలు ఎపుడో తిరస్కరించారని అన్నారు. ప్రజల దృష్టిలో పలుచనయ్యే మాటలు మాట్లాడొద్దని ఆయన హితవుపలికారు. బీసీల కోసం ప్రవేశ పెట్టిన పథకాలను కృష్ణయ్య తప్పు పట్టడం సమంజసం కాదన్నారు. విపక్షాలు నిజాలు గ్రహించి మాట్లాడితే మంచిదని అన్నారు. ఇది సుస్పష్టంగా పేదల అనుకూల బడ్జెట్ అని కొనియాడారు. వెనుకబడిన, అణగారిన వర్గాలకు కేటాయింపులు భారీగా పెరిగాయని తెలిపారు.ఇది బ్యాలట్ బాక్స్ బడ్జెట్ కాదు పేదలను ఉద్ధరించే బడ్జెట్ అని కొప్పుల చెప్పారు. -
అభివృద్ధికి దర్పణం: కొప్పుల
హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చాటిందని చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన శుక్రవారం ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, చింతా ప్రభాకర్ తో కలసి విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలు అనుసరించిన పద్దతి విచారకరమని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ జాతీయ సగటు కన్నా వృద్ధి రేటు సాధించడం అభినందనీయమన్నారు. సంక్షేమ రంగంలో దేశం లోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. బీసీల్లో అత్యంత వెనుక బడిన వర్గాలకు ప్రభుత్వం ఇస్తోందన్నారు. మెట్రో రైల్ త్వరలోనే అందుబాటు లోకి వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ సీఎం తీసుకోనన్ని నిర్ణయాలను మానవతాకోణంలో తీసుకున్నారని చెప్పారు.విపక్షాలు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. -
‘జనావేదన కాదు..కాంగ్రెస్ ఆవేదన’
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నవి జనావేదన సభలు కావు ... అవి కాంగ్రెస్ ఆవేదన సభలని తెలంగాణా రాష్ర్ట సమితి మండిపడింది. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలి పెడుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడాతూ కేంద్ర మంత్రిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా తాను జాతీయ వాదినని ప్రకటించుకున్నది జైపాల్ కాదా అని ప్రశ్నించారు. సోనియాతో ఎపుడైనా తెలంగాణపై జైపాల్ చర్చించారా అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయకుండా ప్రజాక్షేత్రం నుంచి పారిపోయిన విషయం ఆయనకు తెలియదా అని గుర్తుచేశారు. ఉద్యమంలో కాంగ్రెస్ నేతలను గ్రామాలకు రానివ్వని సంగతి తెలియదా అని అన్నారు. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు అయిన తర్వాత ఇపుడు వారు ఉద్యమం గురించి మాట్లాడటం ఏమిటన్నారు. జైపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంపై, ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ప్రజల ప్రశంసలు అందుకోని ప్రభుత్వ కార్యక్రమమేలేదని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడటానికి ఏం లేదు కాబట్టే అనవసర విషయాలపై కాంగ్రెస్ నేతలు దృష్టిపెట్టారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 28 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని, భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. జేఏసీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఉద్యోగాలే భర్తీ కానట్టు కొందరు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్, టీడీపీలతో కలిసి పోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. -
టీడీపీ వల్లే వ్యవస్థలన్నీ నాశనం
చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో తెలం గాణలోని వ్యవస్థల న్నీ నాశనమయ్యా యని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.చంద్రబాబు హయాంలో హైదరాబాద్ లోని విలువైన భూములను కాజేశారని, చెరువులను ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా మార్చారని దుయ్య బట్టారు. ప్రభుత్వంపై ఆ పార్టీ నేత రేవం త్‌రెడ్డి అనవసరంగా నోరు పారేసు కుంటు న్నారని సోమవారం ఒక ప్రకటనలో విమ ర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి పట్టించుకోనివారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రెండున్నరేళ్ల కిం దట అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసిందని విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఆంధ్రాబాబుల ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి రేవంత్ తెలంగాణ కు చీడపు రుగులా మారారని అన్నారు. -
గుడ్‌లైఫ్ హాస్పిటల్ ప్రారంభం
కరీంనగర్‌హెల్త్ : నగరంలో ఏర్పాటు చేసిన గుడ్‌లైఫ్ హాస్పిటల్‌ను శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్ అరీఫ్ అహ్మద్, ఐఎంఏ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ భూంరెడ్డి, డాక్టర్ కిషన్, డాక్టర్ డీసీ తిరుపతిరావు, డాక్టర్ రఘురామన్, డాక్టర్ పుల్లెల పవన్‌కుమార్, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అంకిత్ సక్సెన, డాక్టర్ సాయిచందర్, నవీద్‌పాషా, మున్నా, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
'60 ఏళ్లుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలైంది. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ చర్చను ప్రారంభిస్తూ.. గత 60 ఏళ్లుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు. గోదావరి నదీ జలాల విషయంలో మహారాష్ట్రతో 4 దశాబ్దాలుగా ఉన్న వివాదాన్ని పరిష్కరించామని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైన్‌పై విపక్షాలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.