వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరుడిని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తన కుటుంబ సభ్యులతో కలసి శనివారం దర్శించుకున్నారు. స్వామికి అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మధ్యాహ్నానికి సుమారు 15 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 25 వేల మంది భక్తులు తరలివచ్చారు.
ఆదివారం సెలవు కావడంతో 50 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పట్టణంలోని లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో సీఐ ఎ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఐడీ, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు లేకుండా గదులు ఎవరికైనా అద్దెకిచ్చారా అన్న వివరాలను పరిశీలిస్తున్నారు.