సమావేశానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు
సాక్షి, పెద్దపల్లిరూరల్: పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ సారథ్యంలోనే ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలోని కోటి ఎకరాల మాగాణికి సాగునీరందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మహాయజ్ఞంలా నీటి పథకాలకు శ్రీకారం చుట్టారని, గడిచిన ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో చేపట్టిన పలు పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించేలా కేసీఆర్ రూపకల్పన చేశాడన్నారు. రైతాంగానికి అవసరమైన సాగునీటిని నిరంతరం అందించేందుకు రాష్ట్రంలో 23భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి పూర్తి చేసే స్థాయికి చేరిందన్నారు.
గోదావరి నదినే మళ్లించాం..
ఇంతకాలం గోదావరి నదిలో మిగిలిన నీరంతా సముద్రంలో వృథాగా కలిసిపోయేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ సభ్యులకు వివరించారు. ఆ వృథా నీటిని సముద్రంలోకి పోకుండా రైతాంగానికి ఉపయోగపడేలా చూడాలనే మంచి ఆలోచనతోనే కాళేశ్వరం ప్రాజెక్టును యజ్ఞంలా చేపట్టామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కువగా చేయడంతో ఆ వైపు నుంచి ఎస్సారెస్పీకి చుక్కనీరు రాని పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా నీటిని మళ్లిస్తున్నామంటే గోదావరి నదికి మళ్లించినట్లేనని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు ఆశించిన స్థాయిలో జరుగడం లేదని తుదిగడువుకల్లా ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ శ్రీదేవసేనకు మంత్రి సూచించారు.
సాగునీటిపై రగడ..
జిల్లాలో పంటల సాగు, రైతాంగ సమస్యలపై ఓదెల జెడ్పీటీసీ గంట రాములు ప్రశ్నలు లేవనెత్తడం.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రతీసారి సాగునీటిపై మాట్లాడం ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం సాగునీటి రగడకు కారణమైంది. సభలో ఈ అంశంపైనే అరగంటకు పైగా చర్చ జరిగింది. పంటల సాగుకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, పంట సాగు చేయాలా వద్దా, కాళేశ్వరం నీళ్లు వస్తాయో లేదో తెలియదని, జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉండడంతో ఆందోళనలో రైతులున్నారని గంట రాములు ప్రస్తావించారు.
ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆరుగురు రైతులకు ఇప్పటికీ పరిహారం అందించలేదని, ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకుంటారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎస్సారెస్పీలో నీళ్లుంటెనే పారుతాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సాగునీటిపై రాద్ధాంతం చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. రైతాంగ సంక్షేమంపై ఏదో పెద్ద ఆపేక్ష ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు.
పైద్దపల్లి నియోజకవర్గంలో కాలువ చివరి భూములకు సాగునీరందించేందు కు కాలువల వెంట తిరిగి రైతులకు అండగా ని లిచామని మనోహర్‌రెడ్డి వివరించారు. సాగునీ టి లభ్యత లేదంటూ వరిపంటను సాగు చేసుకో వద్దంటూ గ్రామాల్లో ప్రచారం చేయాలంటూ వ్యవసాయాధికారికి గంట రాములు సూచించడంతో సుల్తానాబాద్ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మ నోహర్‌రెడ్డి సాగునీటిని రైతులకు అందించాలని పరితపిస్తే, ఇన్నాళ్లు ఇంట్లో నిద్రపోయి ఇపుడు మాట్లాడుతారా అంటూ నిలదీశారు. జెడ్పీటీసీ పుట్ట మధు, మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకుని సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
మహాయజ్ఙంలా సా గుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ ఎన్ని ప్రయత్నాలు చే సిందో ప్రజలందరికీ తెలిసిందేనని, ఇకనైనా ఇ లాంటి పద్ధతులు మాని ప్రభుత్వం చేపట్టే మం చి పథకాల అమలుకు సహకరించాలన్నారు. అ యితే తాను ఎలాంటి దురుద్దేశ్యంతో మాట్లాడలేదని రాములు సర్ది చెప్పేందుకు యత్నించారు.
వ్యవసాయంపై మొదలై.. ప్రాజెక్టుల వైపు మళ్లిన చర్చ
పెద్దపల్లి జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుపై మొదలైన చర్చ ప్రాజెక్టుల వైపునకు మళ్లింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరినాట్లు ఆశించినస్థాయిలో జరగకపోయినా ఆగస్టు15 నాటికల్లా వేసుకునేందుకు అవకాశముందని, ఇందుకు పలురకాల స్వల్పకాలిక విత్తనాలున్నాయని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ సభ్యులకు వివరించారు. సబ్సిడీ విత్తనాల పంపిణీకి 42కేంద్రాలను ఏర్పాటు చేసి 10,692 క్వింటాళ్ల విత్తనాలను అందించామని వివరించారు.
బయోమందుల అమ్మకాలు జరిగినట్టు తమ దృష్టికి వస్తే వాటిని వెనక్కి పంపించామని పేర్కొన్నారు. రైతుబీమా పథకం కింద 256మందికి రూ.12కోట్ల30లక్షలను పదిరోజుల్లోనే జమ చేయించామన్నారు. రైతుబంధు పథకం జిల్లాలో కోటి 25లక్షల మందికి వర్తింపజేయగా 70వేల మంది రైతుల ఖాతాకు జమ అయ్యాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment