
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ తీరు విచిత్రంగా ఉందని, సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడం చూస్తుంటే సభలో చర్చించడం వారికి ఇష్టం లేదని అర్థమవుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సమావేశాల్లో చర్చించడానికి కాంగ్రెస్ దగ్గర సబ్జెక్ట్ లేదన్నారు. సోమవారం మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ఎన్ని రోజులైనా సభ జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ సభా సంప్రదాయలను పట్టించుకోవడం లేదన్నారు.