హైదరాబాద్: తెలంగాణను అప్పుల రాష‍్ట్రం అని మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించటం తగదని చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పులు చేయలేదా? అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యమా? అని ప్రశ్నించారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఓ ఆకతాయిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే టీఆర్ఎస్‌కు చివరి బడ్జెట్ అని రేవంత్ అనడం సిగ్గుచేటని తెలిపారు. టీడీపీని తెలంగాణ ప్రజలు ఎపుడో తిరస్కరించారని అన్నారు.
ప్రజల దృష్టిలో పలుచనయ్యే మాటలు మాట్లాడొద్దని ఆయన హితవుపలికారు. బీసీల కోసం ప్రవేశ పెట్టిన పథకాలను కృష్ణయ్య తప్పు పట్టడం సమంజసం కాదన్నారు. విపక్షాలు నిజాలు గ్రహించి మాట్లాడితే మంచిదని అన్నారు. ఇది సుస్పష్టంగా పేదల అనుకూల బడ్జెట్ అని కొనియాడారు. వెనుకబడిన, అణగారిన వర్గాలకు కేటాయింపులు భారీగా పెరిగాయని తెలిపారు.ఇది బ్యాలట్ బాక్స్ బడ్జెట్ కాదు పేదలను ఉద్ధరించే బడ్జెట్ అని కొప్పుల చెప్పారు.
అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యమా?
Published Mon, Mar 13 2017 4:09 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
Advertisement