
'విపక్షాలది అనవసర రాద్ధాంతం'
హైదరాబాద్: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ శనివారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశాన్నైనా చర్చించడానికి సిధ్దంగా ఉన్నామన్నారు. ఈ సమావేశాల్లో 4 ఆర్డినెన్సులను ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.