'కొప్పుల ఈశ్వర్ ను మంత్రిని చేస్తా' | kcr promises koppula eswar will take into his cabinet | Sakshi
Sakshi News home page

'కొప్పుల ఈశ్వర్ ను మంత్రిని చేస్తా'

Published Sun, Jul 5 2015 5:33 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'కొప్పుల ఈశ్వర్ ను మంత్రిని చేస్తా' - Sakshi

'కొప్పుల ఈశ్వర్ ను మంత్రిని చేస్తా'

కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ను మంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేసీఆర్ ఈ మేరకు తన మనసులో మాటను వెల్లడించారు. ధర్మారంలో మాట్లాడుతూ.. కొప్పుల ఈశ్వర్ ను తన కేబినెట్ లో తీసుకుంటానని స్పష్టం చేశారు.

అంతకుముందు పెద్దపల్లిలో హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ అన్నారు. మన బతుకుల కోసం మనమే కొట్లాడాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొక్కలను బతికించుకోవాలని, అందరి బాధ్యతా ఉందని కేసీఆర్ చెప్పారు. గ్రామపంచాయతీ ఉద్యోగుల పనితీరు సరిగాలేదని, గ్రామాల రికార్డులకే పరిమితమయ్యారని, పనితీరు మెరుగుపడాలని కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో మొక్కలు నాటి పరిరక్షించాంలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 15 రోజుల్లో కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తానని అన్నారు. కేసీఆర్ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement