కరీంనగర్ : రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా, ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ పథకాలు, విపక్షాల ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రతిపక్ష నేతలు వస్తే తేల్చుకుందామని సవాల్ చేశారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రంగా స్పందించారు.
ప్రభుత్వం చేపట్టిన పథకాల లక్ష్యం నెరవేరితే తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చకు ఎక్కడైనా సిద్ధమని, ఏ గ్రామంలో చర్చ అన్నది ప్రతిపక్షాలు నిర్ణయించాలని సూచించారు.
ఏ గ్రామంలోనైనా చర్చకు రెడీ: కొప్పుల
Published Mon, Oct 12 2015 3:08 PM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM
Advertisement
Advertisement