Telangana Chief whip
-
ఏ గ్రామంలోనైనా చర్చకు రెడీ: కొప్పుల
కరీంనగర్ : రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా, ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ పథకాలు, విపక్షాల ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రతిపక్ష నేతలు వస్తే తేల్చుకుందామని సవాల్ చేశారు. సోమవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల లక్ష్యం నెరవేరితే తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చకు ఎక్కడైనా సిద్ధమని, ఏ గ్రామంలో చర్చ అన్నది ప్రతిపక్షాలు నిర్ణయించాలని సూచించారు. -
చీఫ్ విప్‌ను అడ్డుకున్న ఆశావర్కర్లు
ఆదిలాబాద్ (జైపూర్) : తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదేలును ఆశావర్కర్లు శుక్రవారం అడ్డుకున్నారు. జైపూర్ మండలం శెట్టిపల్లిలో రూ.కోటి 75 లక్షలతో రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయనను ఆశావర్కర్లు నిలదీశారు. 24 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నదని ఆశావర్కర్లు వాపోయారు. దీనికి స్పందించిన ఆయన వారితో మాట్లాడుతూ..మీ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. -
శ్రీవారి ఆశీస్సులతోనే 'తెలంగాణ' కల నెరవేరింది : కొప్పుల
తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే తెలంగాణ కల నెరవేరిందని ఆ రాష్ట్ర చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం మొదలైన సమయంలో శ్రీవారిని దర్శించుకుని స్వామివారిపై భారం వేసి వెళ్లానని, ఆయన ఆశీస్సులతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. తమ రాష్ట్రం నేడు మంచి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్టు చెప్పారు.