తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి టీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశముంది. కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఈశ్వర్ దళిత సామాజిక వర్గానికి చెందినవారు. కేసీఆర్ కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే తొలివిడతలో చాన్స్ దక్కలేదు. స్పీకర్గా ఈశ్వర్ను ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్న సమాచారం. ఈ నెల 15 తర్వాత కేసీఆర్ కేబినెట్ను విస్తరించనున్నారు.