జవాబుదారి తనంతో పనిచేస్తా | Give Chance Again Work with Accountability Said TRS Mla | Sakshi
Sakshi News home page

జవాబుదారి తనంతో పనిచేస్తా

Published Mon, Nov 12 2018 9:17 AM | Last Updated on Mon, Nov 12 2018 9:18 AM

Give Chance Again Work with Accountability Said TRS Mla - Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారికి పార్టీ కండువా కప్పుతున్న ఈశ్వర్‌

ధర్మారం: ఎమ్మెల్యేగా ప్రభుత్వ చీఫ్‌విప్‌గా జవాబుదారితనంతో పనిచేస్తా మరోకసారి అవకాశం ఇవ్వండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ధర్మపురి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పెర్కపల్లి, బొమ్మారెడ్డిపల్లి గ్రామాలలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. పెర్కపల్లి, బొమ్మారెడ్డిపల్లి గ్రామాలలోని మహిళలు ఈశ్వర్‌కు ఘన స్వాగతం పలికారు. మహిళలు కోలాటం, ఓగ్గుడోలు కళాకారులు నృత్యాలతో గ్రామంలో ర్యాలీగా వెళ్లారు. ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర నాలుగున్నర ఏళ్లల్లో అన్ని రంగాల ప్రజలకు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు. కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ పుస్కూరి నర్సింగరావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పెంచాల రాజేశం, ముత్యాల బలరాంరెడ్డి, చింతల జగన్మోహన్‌రెడ్డి, పాక వెంకటేశం, భాస్కర్‌నాయక్, గంగిపెల్లి కోమురయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు సత్తరవెని సది, పంబాల అయిలవ్వ, గంగిపెల్లి నర్సయ్య, అచ్చె సత్తయ్య, చిమ్మల చిన్న రాజయ్య, మెడవేని పెద్దులు, కట్ట స్వామి, మద్దునాల వెంకటేశం పాల్గొన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement