
సాక్షి ,పెద్దపల్లి: కొత్తూరి రవి వేసిన రాజకీయ జంపులకు కొందరు తీన్మార్ రవి అని పిలుచుకుంటున్నారు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన కొత్తూరి రవి నాలుగు రోజుల క్రితం బీజేíపీ నాయకుడు.. మూడు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరాడు. బుధవారం గుజ్జుల రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో రవికి బీజేపీ కండువా కప్పారు. పొరపాటు జరిగిందని తిరిగి గురువారమే టీఆర్‌ఎస్‌లో చేరడంతో వారంరోజుల్లో రెండు పార్టీల కండువాలను నాలుగుసార్లు కప్పుకున్నట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment