
సాక్షి, జగిత్యాల : మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్‌లకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం హిమ్మత్ రావు పేటకు వెళుతున్న మంత్రుల వాహనాలను రాంసాగర్ చౌరస్తా వద్ద కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు, రైతులు అడ్డుకున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంటనే పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆరు కుటుంబాలకు రావలసిన పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలని రోడ్డుపై బైటాయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని ఆందోళన చేపట్టారు. 15 నిమిషాల పాటు మంత్రుల వాహనాలను ఎటూ కదలనీయకుండా అడ్డగించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య మంత్రులు హిమ్మత్ రావు పేటకు బయలు దేరారు.
Comments
Please login to add a commentAdd a comment