అభివృద్ధికి దర్పణం: కొప్పుల | governor speech symbol for telangana development | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి దర్పణం: కొప్పుల

Published Fri, Mar 10 2017 1:50 PM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

అభివృద్ధికి దర్పణం: కొప్పుల - Sakshi

అభివృద్ధికి దర్పణం: కొప్పుల

హైదరాబాద్‌: అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ చేసిన ప్రసంగం..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చాటిందని చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన శుక్రవారం ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, చింతా ప్రభాకర్ తో కలసి విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలు అనుసరించిన పద్దతి విచారకరమని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ జాతీయ సగటు కన్నా వృద్ధి రేటు సాధించడం అభినందనీయమన్నారు.

సంక్షేమ రంగంలో దేశం లోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. బీసీల్లో అత్యంత వెనుక బడిన వర్గాలకు ప్రభుత్వం ఇస్తోందన్నారు. మెట్రో రైల్ త్వరలోనే అందుబాటు లోకి వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ సీఎం తీసుకోనన్ని నిర్ణయాలను మానవతాకోణంలో తీసుకున్నారని చెప్పారు.విపక్షాలు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిదని  హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement