దివ్యాంగులు, వృద్ధుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు | Toll Free Numbers For Emergency Cases Of Older People In Telangana | Sakshi
Sakshi News home page

దివ్యాంగులు, వృద్ధుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

Published Sun, Apr 5 2020 2:36 AM | Last Updated on Sun, Apr 5 2020 2:36 AM

Toll Free Numbers For Emergency Cases Of Older People In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో దివ్యాంగులు, వృద్ధులకు అత్యవసర సేవలందించేందుకు రాష్ట్ర దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ ఏర్పాటు చేసింది. దివ్యాంగుల కోసం 1800 5728980, వృద్ధుల కోసం 14567 టోల్‌ఫ్రీ నంబర్లను ఆ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం తన క్యాంపు ఆఫీసులో ప్రారంభించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందేందుకు నిర్దేశిత కార్యాలయానికి వెళ్లేవారికి, ఇంకా అత్యవసర సేవలు అవసరమైనవారికి ఈ టోల్‌ఫ్రీ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.

సహాయకులకు పాస్‌లు జారీ: దివ్యాంగులు, వృద్ధులకు సహాయకులుగా ఉండే వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా పాసులు ఇవ్వనుంది. అత్యవసర సమయంలో సహాయకులను తీసుకెళ్లేందుకు వీలుగా వీటిని వినియోగించుకోవచ్చు. దివ్యాంగులు/వృద్ధులు సూచించిన వారికి పాసులు జారీ చేయాలని సదరు మంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement