
సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధం: కొప్పుల
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద ్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. విపక్షాలు సభను తప్పుదోవ పట్టించే విమర్శలు చేస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9.30 గంటలకు గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తామని తెలిపారు. 11 గంటలకు గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బీఏసీ జరుగుతుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పనిదినాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతీ రోజు సభ ఉదయం 10 గంటలకు మొదలై మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుందన్నారు. సభ సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, విపక్షాలు రాద్ధాంతం చేస్తే దీటైన సమాధానం చెబుతామని పేర్కొన్నారు.