
రాజధానిలో 482 మద్యం దుకాణాలకు లైసెన్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం 482 మద్యం దుకాణాలకు లెసైన్సులు కేటాయించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 212 దుకాణాలుండగా 312 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 147 దుకాణాలకు లాటరీ విధానం ద్వారా లెసైన్సులు కేటాయించారు. మరో 65 దుకాణాలు ఖాళీగా మిగిలాయి. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో 390 దుకాణాలుండగా 3368 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం 335 దుకాణాలకు లాటరీ విధానంలో లెసైన్సులు కేటాయించారు. ఈ జిల్లాలో 55 దుకాణాలు ఖాళీగా మిగిలాయి. ఖాళీగా మిగిలిన దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అబ్కారీశాఖ వర్గాలు తెలిపాయి.
అత్యధిక దరఖాస్తులు ఇక్కడే..
గ్రేటర్ నగరం పరిధిలోని బండ్లగూడలోని ఓ మద్యం దుకాణానికి అత్యధికంగా 56 దరఖాస్తులు అందాయి. ఆ తర్వాత వనస్థలిపురంలోని మరో దుకాణానికి 49 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక రియాసత్‌నగర్,మలక్‌పేట్‌ల్లోని దుకాణాలకు 14 చొప్పున దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రకటించారు. చాలా దుకాణాలకు సింగిల్ టెండర్లు మాత్రమే దాఖలయ్యాయని తెలిపారు.