
లేడీ సూపర్ స్టార్ నయనతార నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో నయన్ 37వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ, అభిమానులనుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నయనతార ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేయసికి ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నయన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘హ్యపీ బర్త్‌డే బంగారం(తంగమై).. నువ్వు ఎల్లప్పుడూ అదే స్పూర్తినిస్తూ, అంకితభావంతో, నిజాయితీగా ఉండు. భగవంతుడు ఎల్లప్పుడూ నిన్ను సంతోషం, విజయాలతో ఆశీర్వదిస్తాడు. పాజిటివిటీ, అద్భుతమైన క్షణాలతో నిండిన మరో సంవత్సరాన్ని ఎంజాయ్ చేయ్’ అని పేర్కొన్నారు. ఇక నయనతార, విఘ్నేశ్ శివన్ విడదీయలేని ప్రేమ బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ప్రేమలో ఉన్నామని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అంధురాలిగా నయన్.. ట్రెండింగ్‌లో ఫస్ట్‌లుక్
కాగా నయన్ పుట్టిన రోజు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం 'నెట్రికన్' (మూడో కన్ను సినిమాలోని టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో నయన్ అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. టీజర్‌లో..అంధురాలిగా తనకు ఎదురుపడే సవాళ్లను ఛాలెంజ్‌గా ఎదుర్కొని ఎలా పరిష్కరిస్తుందనేది కనిపిస్తోంది. ఇందులో నయన్ అద్భుతంగా నటించడంతో.. టీజర్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిణిగా నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాకు మిలింద్‌రావ్ దర్శకత్వం వహిస్తుండగా నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంతో దర్శకుడైన విఘ్నేష్ శివన్ నిర్మాతగా అవతారమెత్తుతున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి మిలింద్ రౌ దర్శకుడు. గిరిష్ జి సంగీతం అందిస్తున్నారు. చదవండి: బోర్ కొట్టినప్పుడే పెళ్లి: నయన్–విఘ్నేశ్
Big Day ✨💥 🎂 pic.twitter.com/qu6c4WQhLw
— Nayanthara✨ (@NayantharaU) November 17, 2020
Comments
Please login to add a commentAdd a comment