
ఇటీవల స్టార్ లు నటించిన చిత్రాలకు వివాదాలు కామన్ అయిపోయాయి. తాజాగా నటి నయనతార, దర్శకుడు గోపీనాయినార్‌ల చిత్రం అరమ్‌పై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రాన్ని కన్నడ చిత్రం పరివారా కథతో రూపొందిం చారని, తన అనుమతి పొందకుండా తమ కథతో సినిమాను తెరకెక్కించారని కర్ణాటకకు చెందిన పరివారా చిత్ర నిర్మాత మనోజ్ చెన్నై హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. అందులో తన చిత్ర కథను దొంగిలించినందుకు రూ.2 కోట్లు నష్టపరిహారం చెలించేలా ఆ చిత్ర దర్శక నిర్మాతలను ఆదేశించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది.