
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు పోటి ఇచ్చే స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ నయనతార. వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలతో ఘనవిజయాలు సాధిస్తున్ ఈ భామ, అదే స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోంది. ఇప్పటికే నయన్‌కు ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ భామ పాత రికార్డులన్నింటిని చేరిపేసేందుకు రెడీ అవుతోంది. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఓ తమిళ సినిమాకు ఏకంగా 4.25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనుందట. ఇంత వరకు సౌత్‌లో ఏ హీరోయిన్ కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకున్న దాఖాలలు లేవంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే నయన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన కో కో కోకిల, ఇమాయక్క నొడిగళ్ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండగా విశ్వాసం, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment