
అజిత్, నయనతార
అజిత్, నయనతారలు ఆడి పాడుకోవడానికి హైదరాబాద్‌లో భారీ సెట్ సిద్ధమైంది. ఈ జంట తొలిసారిగా 2008లో ఏగన్ చిత్రంలో జత కట్టారు. ఆ తర్వాత నటించిన బిల్లా, ఆరంభం చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా నాలుగోసారి విశ్వాసం చిత్రం కోసం ఈ క్రేజీ జంట జతకట్టనున్నారు. వీరం, వేదాళం, వివేగం చిత్రాలను తెరకెక్కించి శివ మరోసారి విశ్వాసం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం సెట్‌పైకి వెళ్లవలసింది. అయితే చిత్ర పరిశ్రమ సమ్మె కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన సెట్ నిర్మాణం పూర్తి అయినట్లు సమాచారం. ఇందులో అజిత్ నయనతారల ప్రేమ సన్నివేశాలు, ప్రణయగీతాలను చిత్రీకరించనున్నారని తెలిసింది.
ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన అజిత్ చిత్రానికి తొలిసారి పని చేస్తున్నారు. చిత్ర షూటింగ్ ఈ నెల చివరిలో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment