అసలేం జరిగింది? | nayanatara new movie | Sakshi

అసలేం జరిగింది?

Published Thu, Apr 13 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

వారిది ప్రేమ వివాహం. ప్రేమ కబుర్లు, చిన్ని అలకలు, సరదాలు.. జీవితం చాలా ఆనందంగా సాగుతుంటుంది. ఆకస్మాత్తుగా జరిగిన ఓ సంఘటన వారి జీవితాల్లో కల్లోలం రేపుతుంది. ఆ ఇంట్లో నవ్వులు లేవు.. అలకలు లేవు.. సరదాలు లేవు. అంతా నిశ్శబ్దం. అసలేం జరిగింది? ఆ దంపతుల జీవితంలో కల్లోలం సృష్టించిన సంఘటన ఏంటి? దాన్నుంచి వాళ్లెలా బయటపడ్డారు? అనే విషయాలు తెలసుకోవాలంటే మా చిత్రం చూడాలంటున్నారు దర్శకుడు ఎస్‌.కె షాజన్‌. ఆయన దర్శకత్వంలో రూపొందిన మలయాళ హిట్‌ ‘పుదియ నియమం’ను తెలుగులో ‘వాసుకి’ పేరుతో అనువదించారు.

శ్రీరామ్‌ సినిమా పతాకంపై ఎస్‌.ఆర్‌. మోహన్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. నయనతార లీడ్‌ రోల్‌ చేసిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నారు. ‘‘ఇందులో నయనతార చేసిన పాత్ర ప్రతి మహిళకు కనెక్ట్‌ అవుతుంది. చిత్రాన్ని మేలో విడుదల చేయాలనుకుంటున్నాం. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. గోపీ సుందర్‌ అందించిన సంగీతం హైలెట్‌’’ అని అన్నారు నిర్మాత ఎస్‌.ఆర్‌. మోహన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement