
తమిళసినిమా: దసరా, దీపావళి, సంక్రాంతి మాదిరిగానే సమ్మ ర్ కూడా సినిమా వాళ్లకు పండగే. విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు సెలవులు కావడంతో ఆ సమయాల్లో చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతుంటా రు. అలా సమ్మర్‌కు బరిలోకి దిగడానికి శివకార్తీకేయన్ మిస్టర్‌లోకల్ చిత్రం రెడీ అవుతోంది. సీమరాజా చిత్రం తరువాత ఈ సక్సెస్‌ఫుల్ నటుడు నటిస్తున్న చిత్రానికి మిస్టర్‌లోకల్ అనే టైటిల్‌ను చిత్ర వర్గాలు అధికారికపూర్వంగా ఖరారు చేశారు. సాధారణంగా చిత్రాలకు టైటిల్స్ చాలా హెల్ప్ అవుతాయి. అందుకే అటు కథను నప్పేలా, అదే సమయంలో ప్రేక్షకుల్లోకి ఈజీగా వెళ్లేలా టైటిల్స్‌ను నిర్ణయించుకుంటారు. అయితే అవి అందరికీ, అన్నిసార్లు కరెక్ట్‌గా సరిపడేలా అమరవు. నటుడు శివకార్తీకేయన్‌కు మాత్రం ఇప్పటి వరకూ తన ఇమేజ్‌కు సరిపడేవి, కథకు నప్పేవే అమిరాయనే చెప్పాలి.
అదే విధంగా దర్శకుడు రాజేశ్.ఎం చిత్రాల టైటిల్స్ చర్చనీయాంశంగా ఉంటాయి. ఇక స్టూడియోగ్రీన్ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజా తన చిత్రాలకు జనాకర్షకమైన పేర్లను ఎంచుకుంటారన్న పేరు ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే మిస్టర్ లోకల్. ఈ చిత్రం కోసం పలు పేర్లను పరిశీలించి చివరకు మిస్టర్ లోకల్ పేరును ఎంపిక చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేశారు. నటుడు శివకార్తీకేయన్ తెరపై నటించే పవర్‌ఫుల్ నటన పాజిటివ్‌గా ఉంటుంది. అది చూసినప్పుడు దర్శకుడికి ఆయనతో పోటీ పడాలనే అసక్తి కలుగుతుంది అని అన్నారు దర్శకుడు రాజేశ్.ఎం. ఇక ఇందులో అదనపు ఆకర్షణ ఏమిటంటే అగ్రనటి నయనతార నాయకి కావడం. ఆమె తెరపై అద్భుతాలు చేస్తున్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా ప్రోత్సాహం యూనిట్‌కు ఎంతగానో సహకరిస్తోందని అన్నారు. ఫుల్ మాస్ ఎంటర్‌టెయినర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ స్పెషల్‌గా మిస్టర్ లోకల్ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి వస్తుందని దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment