అమరన్ సక్సెస్‌.. స్వయంగా బిర్యానీ వడ్డించిన హీరో! | Kollywood Super Star Siva Karthikeyan Serves Biryani For SK23 Movie Cast And Crew, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Siva karthikeyan: షూటింగ్‌ సెట్‌లో బిర్యానీ వడ్డించిన శివకార్తికేయన్.. వీడియో వైరల్!

Published Wed, Nov 20 2024 1:50 PM | Last Updated on Wed, Nov 20 2024 3:14 PM

Kollywood Super Star Siva karthikeyan Serves Biryani For cast and crew

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అమరన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలై మూడు వారాలైనప్పటికీ కలెక్షన్స్‌ పరంగా రాణిస్తోంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్‌ మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్‌కే23 వర్కింగ్‌ టైటిల్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అమరన్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్ నిర్వహించారు. షూటింగ్ సెట్‌లోనే ఈ వేడుకలు చేసుకున్నారు.

అనంతరం మూవీ సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు. హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం కీలక పాత్రలు పోషించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement