అదిరిపోయిన ‘పెద్దన్న’ ట్రైలర్‌.. దీపావళికి రానున్న రజనీ | Annaatthe trailer out Rajinikanth Gives Eye Feast to Fans with His Action | Sakshi
Sakshi News home page

Rajnikanth: అదిరిపోయిన ‘పెద్దన్న’ ట్రైలర్‌.. దీపావళికి రానున్న రజనీ

Oct 27 2021 7:07 PM | Updated on Oct 27 2021 8:20 PM

Annaatthe trailer out Rajinikanth Gives Eye Feast to Fans with His Action - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. ఆయనకు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. రజనీ సినిమా ఎప్పుడూ వస్తుందా అనుకుంటూ ఎదురుచూస్తూ ఉంటారు. అయితే శివ కుమార్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీ తెలుగులో పెద్దన్నగా రానుంది. అయితే ఈ మూవీ  ట్రైలర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం.

దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ మంచి రెస్పాన్స్‌ పొందడమే కాకుండా మూవీపై అంచనాలు పెంచింది. కాగా తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. అందులో..‘నువ్వు ఎవరనేది నువ్వు వేనకేసుకున్న ఆస్తిలోనో.. నీ చుట్టూ ఉన్న వాళ్లకి నీ మీద ఉన్న భయంలోనో లేదు. నువ్వు చేసే చర్యల్లోనూ.. మాట్లాడే మాటాల్లోనూ ఉంటుంది. ఇది వేదవాక్కు’ అంటూ ఆయన చెప్పిన మాస్‌ డైలాగులు అదిరిపోయాయి. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్ నిర్మిస్తున్న​ ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్స్‌ విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement