నయన్ - విఘ్నేశ్ లవ్‌ స్టోరీ.. నాంది పలికింది ఆ సినిమాతోనే..! | The start of Journey Nayanatara and Vignesh Shivan Love Story | Sakshi
Sakshi News home page

Nayanatara and Vignesh Shivan: నయన్ - విఘ్నేశ్ ప్రేమకథ మొదలైంది ఆ సినిమా వల్లే..!

Published Sat, Oct 22 2022 7:26 PM | Last Updated on Sat, Oct 22 2022 7:27 PM

The start of Journey Nayanatara and Vignesh Shivan Love Story - Sakshi

కోలీవుడ్ ప్రేమజంట నయన్- విఘ్నేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట జూన్‌ 2022లో ఒక్కటైంది. తాజాగా నయనతార కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే వారి ప్రేమకథ ఎక్కడ ప్రారంభమైంది? అసలు వారిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? తొలిసారి వారు ఎక్కడ కలిశారు? తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
 
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ ఏడేళ్ల ప్రమాయాణానికి తొలి అడుగు పడింది మాత్రం ఆ సినిమాతోనే. వీరిద్దరి కాంబినేషన్‌లో 2015లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'నానుమ్ రౌడీ ధాన్'. ఈ ప్రేమకథా చిత్రం విడుదలై నేటికి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం. 

మొదటి ఎంపికా నయన్ కాదు:  నాను రౌడీ ధాన్ షూటింగ్ సందర్భంగా మొదటిసారి విఘ్నేశ్ శివన్‌ను నయనతార కలిశారు. ఇక అప్పటి నుంచి వీరి లవ్‌ స్టోరీ ప్రారంభమైంది. ఇక వారిద్దరు ఎక్కడ వెనుదిరిగి చూడలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార మొదటి ఎంపిక కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే అనుకోకుండా ఓ హోటల్‌లో నయనతారను కలుసుకోవడంతో ఈ సినిమాకు కథానాయికగా ఎంపిక చేశారు. 

 నానుమ్ రౌడీ ధాన్ సినిమా విడుదలై 7 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా విఘ్నేష్ శివన్‌ సెట్స్‌లో ఉన్న వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో విఘ్నేశ్,నయనతార  సముద్రం వద్ద సంభాషణలో పాల్గొన్నారు. మొదట్లో వారిద్దరూ ఏదో సీరియస్‌గా డిస్కస్ చేస్తూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ నవ్వుతూ సంభాషించుకున్నారు. విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ 'ఒకప్పుడు పాండీవుడ్‌లో!' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 2016లో నానుమ్ రౌడీ ధాన్  హిట్ కావడంతో వీరిద్దరి రిలేషన్‌పై రూమర్లు వచ్చాయి. అయితే 2016లో జరిగిన సైమా వేడుకలో విఘ్నేష్ శివన్ తనకు అవార్డును అందజేయాలని కోరడంతో వీరి రిలేషన్‌పై గాసిప్స్‌ గుప్పుమన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement