
సాక్షి, సినిమా : నటి నయనతార నా జీవితాన్ని అందంగా మార్చింది మీరే ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. నయన్ నటిగా 14 ఏళ్లు దిగ్విజయంగా అధిగమించారు. ఎన్నో ఎత్తుపల్లాలు, మలుపులు, తీపి, చేదు అనుభవాలను చవిచూసి నంబర్‌వన్ కథానాయకిగా రాణిస్తున్న నయన్ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకొవాలి. సాధారణంగా మీడియాకు దూరంగా అభిమానులతో పట్టనట్లుండే ఈ స్టార్ నటి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అభిమానులకు తన స్వహస్తాలతో ఒక లేక రాయడం విశేషం.
అందులో నా జీవితాన్ని అర్ధవంతంగా మార్చిన మీకు ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాను. మీ అభిమానమే నా జీవితాన్ని అందంగా మార్చింది. నా శక్తి కొలది నటిస్తున్నాను. మిగతాది భగవంతుడికే వదిలేస్తున్నాను. ఎంటర్‌టెయిన్‌మెంట్ చిత్రాలతో పాటు అరమ్ వంటి సందేశాత్మక చిత్రాలను అందించగలుగుతున్నానంటే మీ ఆదరణే కారణం.
మీడియా వారికి, విమర్శకులకు నా కృతజ్ఞతలు. 2018వ సంవత్సరం ఇంకా మంచిగా ఉంటుంది. నాపై ఆదరాభిమానాలను చూపుతున్న అభిమానులకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని నయనతార ట్వీట్ చేశారు. ఈ లేఖకు ఆమె అభిమానులు ఫిదా అయ్యారు. ఉత్సాహంతో ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలను అందిస్తున్నారు.
இனிய
— Nayanthara✨ (@NayantharaU) 1 January 2018
ஆங்கில புத்தாண்டு
நல்வாழ்த்துக்கள் 👍Happy New Year 2018🤗 #Positivity pic.twitter.com/V4eXsTLCL0